30 డిసెం, 2012

వద్దు నీకు ఆత్మశాంతి..వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆత్మఘోషే బడభాగ్ని జ్వాలై 
నరరూప రాక్షసులను దహించేసేదాకా  
వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆక్రోశమే ఆకాశ ఉరుమై..
నెత్తురు తాగే నక్కలను కాల్చేసేదాకా 
వద్దు నీకు ఆత్మశాంతి 
నీ కడగండ్లే మృగాల
మరణసెయ్యకి రంపపుముళ్ళై కొసేసేదాకా  
నీ కన్నిటిలో భారతావని 
నెత్తుటి మరకలు కడగబడ్డాక.. 
నీ ఆవేదనతో భారత ప్రజల 
వేదనాశృవలన్నీ ఆవిరయ్యాక.
అప్పుడు..అప్పుడే.. 
'నిర్భయం'గా నిదురపో..
మానవత్వం పరిమళించే
మనిషి గుండెలో    
అంతవరకూ లేదు రాదు 
వద్దు నీకు ఆత్మశాంతి .
రగలాలి..రగలాలి..
ఈ కార్చిచ్చు ..

11 వ్యాఖ్యలు:

 1. వద్దు నీకు ఆత్మశాంతి, రగలాలి..రగలాలి.మానవ మృగాలను అంతమొదించేదాక ప్రతి హృదయం లో రగలాలి ఈ కార్చిచ్చు ...:(

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ రగిలన మంటల్లో మసైయ్యేది ఎవరో??:-(

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆమె ఎవరిచేతులలో బలైపోయిందో.అలాంటి వారే ..:(
   స్పందనకు ధన్యవాదాలు పద్మర్పిత గారు

   తొలగించు
 3. >>రగలాలి రగలాలి కార్చిచ్చు>>
  ఈ ఆవేశ౦ ఇలాంటి వాటిని జరగకుండా చూసేదాకా కాపాడుకుందాం.

  ప్రత్యుత్తరంతొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))