??????

5 డిసెం, 2012

గుద్దులాట నవ్వులాటై..


నిన్నేమైయ్యిందంటే మా ఆయనకి నాకు డిష్యుం డిష్యుం అయ్పోయిందన్నమాట.
డిష్యుం డిష్యుం ఎందుకైయ్యింది అని పక్కన పెట్టేస్తే..

బేసిగ్గా మనం క్లాసులు పీకెవాళ్ళంటే ఆమడ దూరం పారిపోతాం..
మరి మన దేవుడు గారికి జోకులు వెయ్యడం బాగ ఇష్టం కదా..
అలా పారిపోయే నన్ను జీవితాన్ని కాచి కాదు కాదు మరగబెట్టేసి మరీ వడపోసేసి తన అనుభవ సారంతో  తెగ క్లాసులు పీకేసే మా ఆయనకి ముడి పెట్టెసాడు..

నాకేమో ఎదుటివాళ్ళు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు అలంటివేమీ తెలీదు అన్నమాట..
సో అలా తింగరి మంగళం పనులు చేసేసి పాపం మా ఆయనని బాగా విసిగించేస్తా..
అలాంటి తింగరి పని ఒకటి చేసి మా ఆయనకి దొరికిపోయా

మా ఆయన క్లాస్ పీకడం మొదలెట్టేసారు..
సరే మనం ఊరుకుంటామా సగటు మొండి పెళ్ళాం లాగ వాదిస్తాం..
వాదన పెరిగి
ధూం ధాం..
డిష్యుం డిష్యుం..
దిత్తై తకతై
ఎడమొహం పెడమొహం..

అంతా అయిపోయాక..
"ఇదంతా కాదురా నేను చెప్పేది నువ్వు కరెక్ట్ గా   రిసీవ్ చేసుకోవట్లేదు ..నీ ఆలోచనా  విధానం మారాలి.."
అన్నారు మా శ్రీవారు కూల్ గా.
" ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు..నువ్వే నా బాధ అర్దం చేసుకోవట్లేదు.."
అని చెప్పి అటు తిరిగి కిటికి వైపు చూస్తున్నా..
"అదిగో మళ్ళీ..ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు..నేను చెప్పేది లోచిస్తున్నావా లేదా."
"హ్మ్మ్ " నేను
"చెప్పు..ఈ క్షణం ఎగ్జాక్ట్ గా  నువ్వేం ఆలోచిస్తున్నవో చెప్పు..ఈ క్షణం ఇప్పుడు చెప్పు..  "
"నిజం చెప్పనా..?"
"చెప్పు  ప్లీజ్..ఈ క్షణం..దాన్నిబట్టి నీ అలోచనలను నేను అర్ధం చేసుకుంటాను.."
అప్పటిదాకా దీక్షగా కిటికీ కర్టెన్ వైపు చూస్తున్న నేను ఇటు తిరిగాను..
"మరీ..మరీ"
"చెప్పు "
............................
............................
............................

"మరీ..వాషింగ్ మెషీన్ లో వేస్తే కర్టెన్లు ముడతలు పడిపోతాయి కదా" అన్నాను

అంతే 
మా ఆయన రియాక్షన్ చూడాలి ..
ఒక్క క్షణం షాక్ గురి అయ్యి అలా ఉండిపోయారు..

"నిజంగా అదే అలోచిస్తున్నా" అన్నా అమాయకంగా మొహం పెట్టి.
వెంటనే ఇల్లు ఎగిరిపోయేలా గాఠ్ఠిగా నవ్వేసారు..
హమ్మయ్యా సారు నవ్వేసారు..:)
నేనూ అప్పటిదాకా ఆపుకుంటున్న నవ్వుని ఆ ఆయన నవ్వుతో జత కలిపా..
ఇంకేమిటి చూస్తున్నారు ??

గొడవ గోదాట్లోకి..
మేము ఆఫీసులకి..:)


క్లాసులు  తప్పితే మిగిలిన విషయాలలో మా ఆయన ప్లాటినమేనండోయ్..:))

ఈ సందర్భంగా ఈ ఫాట వినేయండి మరీ..23 కామెంట్‌లు:

 1. మీ Post చాలా బాగుందండి ముక్యంగా మీ బొమ్మలు చివరిగా రాధగోపాలం సినిమా పాట ఇంకా బాగున్నాయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా బ్లాగుకి స్వాగతం .వ్యాఖ్యకు ధన్యవాదాలు పానకంలో పుడక గారు

   తొలగించండి
 2. మీకు బొత్తిగా భయం లేదండీ మీ గొడవ గురించి..:P:P
  hats off to your way of thinking :D:D

  రిప్లయితొలగించండి
 3. mothaniki ayana yenni classes theesukunna vupayogam ledhani prove chesaru

  రిప్లయితొలగించండి
 4. @జలతారు వెన్నెల: మీ వ్యాఖ్య పొరపాటున డిలీట్ అయిపోయిందండి..:(
  వ్యాఖ్యకు ధన్యవాదాలు..

  రిప్లయితొలగించండి
 5. @Dhathri

  Meeru super andee... Meeru chesina pani super, mee post super..

  -----

  Sirisha

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్ని సూపర్ల మీ స్పందనకు ధన్యవాదాలు శిరీష గారు..:)

   తొలగించండి
 6. మీ కథనం బాగుంది ధాత్రి గారూ!...:-)
  అభినందనలు......@శ్రీ

  రిప్లయితొలగించండి
 7. ఈ ఆయనలందరూ అంతేనండోయ్...>>జీవితాన్ని కాచి వడబోసిన...>>భలే చెప్పారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కదాండీ..మీకు కూడా అనుభవమేనా??
   వ్యాఖ్యకు ధన్యవాదాలు జ్యోతిర్మయిగారు..:)

   తొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))