8 డిసెం, 2012

మా గొప్ప మారాజులు
సూరి :
"ఒరేయ్ సుబ్బిగా... ఆ పుగ అలా గుప్పుగుప్పుమని సేగోడీలు..జంతికల్లెక్కన గాల్లోకి  ఒదిలితే నీగ్గాదు నీపక్కనున్న నాకోత్తాది కేన్సరు "
సుబ్బు :
"ఓసోస్..మాకు తెల్దులే కేన్సరొత్తే ఏటంటా? కలిసే సద్దారి "
సూరి :
"గొప్పొడివిలే.. నీతో నేను సావలేనుగాని ..ఏటి రా ఆకాశంలోకి సూత్తా తెగ ఆలోసిత్తున్నావ్ "
సుబ్బు :
"అడికాదుగానోరేయ్ !కేన్సరంటే గేపకమోచ్చింది మన జానకమ్మ పోయింది కేన్సరుతోనే గాందా"
సూరి:
"అవునురా .ఆయెమ్మ ఇంక లేదంటే గుండెసెరువైపోతుంది..మా గొప్ప మనసు ఆయెమ్మది .."
సుబ్బు : 
"జానకమ్మ పోయాక  జమిందారీగోరు   ఎటేల్లిపోనాడో ?"
సూరి :
"నిజమేరా సుబ్బిగా ఎటేల్లినాడో ??ఎప్పుడైతే ఆ మాతల్లి ని ఇడిసిపెట్టేసినాడో  ఆనాడే ఆయన వైబోగామంతా పోయిందిరా..మడిసి బొత్తిగా కళతెప్పేసిన్నడు "
సుబ్బు :
"అందుకేరా సూరిగా  సెప్పుడు మాటలనికూడదనేది ఆ బంగారు తల్లి నిజంగా లచ్చిమేరా ."
సూరి :
"అవునురా .లేకపోతే పెద్ద జమిన్దారిగారి రెండో భార్య ఆస్తి మీద కన్నేసి కట్టుబట్టలతో ఎల్లగోట్టినా ..మాతల్లి ఒక్క మాట కూడా అడక్కుండా జమిన్దారిగారి ఏనాకాలే ఎల్లిపోనాది "
సుబ్బు :
"ఆ తల్లి ఎమన్నా తక్కువింటి నుంచి ఒచ్చిందేంట్ర్రా  .ఆల్లది ఇంతకంటే పెద్ద జమీను .."
సూరి :
"ఎంత సంపదలోంచోచ్చినా ఆ గర్వమే ఉండేదికాదు .అడిగినోల్లకి లేదనకుండా ఇచ్చేది .మాతల్లికి సేతికెముక ఉండేది కాదు "
సుబ్బు :
"కోటలోంచి ఎల్లిపోనాక గోదారొడ్డున సిన్న పూరిగుడిసెలో సర్డుకుపోనాది "
సూరి :
" మంచితనానికి ఇంకా రోజులేల్లిపోలేదురా.మన అంజయ్యగారుకూడా జమిందారిగోరినంటిపెట్టుకొనే  ఉండేటోడు .. ఆరి ఆస్తులు పోయినా ..ఆరు జీతమియ్యకపోయినా ఆరికోసం కోర్టుల సుట్టూ  తెగ తిరిగినారులే. "
సుబ్బు :
"ఒసోస్ ..ఆమాటకొత్తె బుల్లి జమిన్దారుగారు ఏటి ??..ఆరు కూడా ఎంత గ్రేటో.ఆస్తి మీద కన్నేసి జమిన్దారిగారి రెండో భార్య ఈల్లని ఎల్లగోట్టినా ..కోర్టుల సుట్టూ  తిప్పినా ..పెద్దోల్లందరూ కాలం సేసినాక జమీనంతా  అన్నగారికి ఒప్పజేప్పేసినారు."
సూరి :
"అప్పుడినించే కదరా ఊరికి మంచి రోజులోచ్చినియ్యి .ఆయన జమిందారి పద్దతి గురిన్సి..ఆ ఏటి?? సుట్టుపక్కల పదూల్లకే కాదు ముఖ్యమంత్రి దాకా ఎల్లింది కదరా .ఎంత బాగుసేసాడు రా ఊరుని..ఊరు తీరె మార్సేసాడు..ఇయ్యాల ఊర్లో అందరూ కలో గంజో తగుతున్నారంటే..ఆయన సలవ కాదేటి రా     "
సుబ్బు :
"అంతే కదరా మరీ..
ఏంలాభం  మారాజులకి కట్టాలు తప్పాయేంట్రా..
సామెత సెప్పినట్టు ...అనుమానం మా సెడ్డదిరా ..
గోదారొడ్డున ఆడెవడో అమ్మగోరిని రోజు సుడ్డమేంటి ?
అమ్మగారు ఇలా ఉంటారు అలా ఉంటారని.. నాకనుభవమయ్యిందని ..
ఆడు ఈరిగాడిదగ్గర  వాగాడమేంటి ??
ఊరంతా అది పోక్కడమేంటి ??
అదొచ్చి ఎవడో   జమిన్దారిగారికి సెప్పడమేంటి ??
ఏ కళనున్నడో జమిందారిగోరు.ఆడి మాటలిని జమిందారి పరువు పోతుందని ఇద్దరు పసిబిడ్డ్లలతో  సహా జానకమ్మని  పుట్టింట్లో వుదిలేయడమేంటి ..
సిత్రం కాకపొతేను. "
సూరి :
"సిత్రం కాదురా.. పెద్దోల్లందరూ అంటరే ఇది అని..అదే మరి "
సుబ్బు :
"ఏ  మాట కామాటేరా పరువుకోసం అమ్మగోరిని ఇడిసిపెట్టారు కాని.పేమ లేక కాదురా ..ఆ తర్వాత మడిసి మడిసిలో లేడు .అసలు తర్వాత ఊరు ముకమే సుల్లేదు మారాజు "
సూరి :
"తర్వాత ఎంత ఇదైపొతే ఏంట్రా??తప్పు తెలుసుకొని ఎల్లేసరికి మాయదారి కాన్సరు  ఆయెమ్మ పేనం తీసేసింది "
సుబ్బు  :
"పాపం ఇంకేటి సెత్తారు  .నిండా పదెనేల్లు లేని ఆ పిల్లలకి ఊరునప్పజెప్పేసినాడు.పోని జమీను బుల్లిజమిందారుగోరికి ఒప్పజేప్పుదామంటే ఆయనేమో అన్నగారి ఆస్తి ముట్టుకోనని కూసున్నాడు ."
సూరి :
"అవునులే ఇంకేటి సెత్తారు ..ఆ పసిబిడ్డలకే  అన్ని ఒప్పజేప్పేసి ఎటెల్లిపోనాడో.."
సుబ్బు  :
"ఆ పిల్లలే ఊరునిక సూసుకోవాలి .ఆయన ఉన్నంతకాలం ఊరు ఎలిగిపోయింది .. మా గొప్ప మారాజులు   "

22 వ్యాఖ్యలు:

 1. బాగా రాసారండీ. ఆ యాస భలే చిత్రంగా.. వినడానికి గమ్మత్తుగా ఉంది :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అది గోదారిజిల్లాల యాసండి..ఆయ్..:))
   చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు ప్రియ గారు..:)

   తొలగించు
 2. ప్రత్యుత్తరాలు
  1. నా బ్లాగ్ వీక్షించి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు పద్మర్పితగారు..:)

   తొలగించు
 3. naku konni words ardam kaledu.but ramayanam ani ardamindi.
  good one.
  Chandu

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మొత్తానికి అర్ధమైంది అన్నమాట..
   వ్యాఖ్యకు ధన్యవాదాలు Chandu గారు...:)

   తొలగించు
 4. ఆయ్! చినిమా కత బలేసెప్పేరండి. :))

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అయ్బాబైబాబోయ్.శర్మగారో..మీది మా గొప్పమనసండి.నా బ్లాగ్లోకి వొచ్చి ఓ ముక్క సెప్పినందుకు దండాలండి .:)

   తొలగించు
 5. పల్లె పదాలలో మీరు వ్రాసిన రామాయనం కధ చాలా బాగుంది దాత్రి గారు, మీరు ఇప్పటి వరుకు వ్రాసినవి చాలా బాగున్నాఈ. మీ బ్లాగ్ ఒపెణ్ చెయగానే వచ్చే పాట, బ్లాగ్ సెట్టింగ్స్ చాల బాగునాఇ, చుడగానె చల రిలాక్సు గ అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇది పల్లె పదాలతో రాసిన రామాయణం కాదు పార్వతిగారు..
   నా కల్పితమే అయినా
   ఓ పల్లెలో జరిగిన రామాయణంవంటి కధ
   బ్లాగు నచ్చినందుకు బొలెడన్నీ థాంక్యూలు..:)

   తొలగించు
 6. ధాత్రి గారూ!...
  కోన సీమ యాస బాగా వ్రాసారు కాకుంటే...
  "ఆయ్"...మాత్రం వదిలేసినట్లున్నారు..:-).( నేను కూడా గోదావరి ఒడ్డున పుట్టి పెరిగాను లెండి...)
  సరదా పోస్ట్ బాగుంది ...@శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హహ్హ..:)
   అయితే మీరు గోదారి బిడ్డే అన్నమాట..:)
   అభినందించినందుకు ధన్యవాదాలు శ్రీ గారు..:)

   తొలగించు
 7. dhathri garu meeru chala bagarasaru .ante meeru yasalo vrayadam different ga vundhi.good one

  ప్రత్యుత్తరంతొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))