ఆ ఆనందం మీతో పంచుకుందామని ఇలా వచ్చా..
ప్రశాంతంగా ఉంటూనే ,ధవళ వర్ణంలో మెరిసిపోతూ ఉండే దేవుళ్ళను ఎంత సేపు చూసినా తనివి తీరదు.
తులసి కోట కోసం పడినంత కష్టం పడకుండానే ,చలువరాతి మందిరం దొరికింది శిల్పారామంలో..ఇంటికి తెచ్చుకొని చక్కగా నా దేవుళ్ళను దేవతలను మందిరంలో కొలువు తీర్చాను.
కానీ నా కన్నయ్య ప్రతిమ మందిరంలో చూడ చక్కగా కొంచెం పెద్దది లేకుండా,మందిరం బోసిపోయిందే అని బాధ .
చలువరాతి కన్నయ కోసం చాలా చోట్ల వెతికాను.శ్రీవారి రాజస్థాన్ స్నేహితుడు కూడా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది.
అన్ని చోట్ల పెద్దవాడిగా,రాధను పక్కన ఉంచుకొని ఏ చెట్టు కిందో మురళి వాయిస్తూ ఉంటాడే కానీ ఒంటరిగా చిక్కడే మాయలోడు??
మొన్న ,ధనుర్మాస ప్రారంభం రోజు నా కోరిక మేరకు బిర్లామందిర్ తీసుకెళ్లారు పతిదేవులు
(ఎందుకన్నానంటే,మరి ఆ రోజు ధనుర్మాస ప్రారంభం ,అందులోను శనివారం ..అందుకే నేను అడిగిన వెంటనే,
"దేవీ ..ఈ దినము మేము రాజాలము.మాకు కాలునొప్పి మరి" అని తప్పించుకోబోయిన వారిని,చెలిగి కుదరక అలిగి మొత్తమ్మీద ఒప్పించాను.ఇంత సాహసం చేయబూనారు కాబట్టి ఆ రోజుకి అలా 'పతిదేవు'లైనారు.)
కానీ మా అదృష్టం కొలది,కాదు కాదు నాకే ఎంత క్యూ ఉన్నా చక్కగా అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి ,శ్రీవారి అదృష్ట బలాన , దర్శనం సుళువుగానే అయిపోయింది.
భిర్లా మందిర్ దగ్గర ఒక షాపు ఉంటుంది కదా..అక్కడ బోలెడన్నిచలువరాతి,పంచలోహ,అష్టధాతు దేవుళ్ల విగ్రహాలే కాక,ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు,మరెన్నో పాటల సిడీలు ఉంటాయి కదా!
అక్కడ నేను అనుకొనేంత పరిమాణంలో రాముడి విత్ ఫ్యామిలీ విగ్రహం ఉంది కానీ కన్నయ్యది లేదు.నేను పదే పదే షాపువాళ్ళను అడిగి విసిగించేసరికి, శ్రీనగర్లో చాలా మార్బల్ ఎంపోరియం లు ఉంటాయి మేడం అక్కడ ప్రయత్నించండన్నారు షాపు యజమాని.
ఇక అక్కడి నించి ఒకసారి లేపాక్షి కి వెళ్ళి,అక్కడ కూడా లేవని తీర్మానించుకున్నాక,
శ్రీనగర్ వెళ్ళాం.
అక్కడ వరుసగా చాలా ఎంపోరియంలు ఉన్నాయి. ఒక పెద్ద ఎంపోరియం కూడా ఉంది .అక్కడ కూడా లేడు కన్నయ్య..:(
సరే చివరిగా ఒక చిన్న ఎంపోరియంలో అడిగితే అక్కడ దొరికాడు నా కన్నయ్య.
పూజించే ప్రతిమ ఎక్కువ ఎత్తు,బరువు ఉండకూడదని మా అత్తగారు చెప్పారు .నా కన్నయ్య ఇంచక్కా బరువు కూడా లేకుండా,చిన్నగా,పక్కన రాధను కూడా ఉంచుకోకుండా నా కోసమే చూస్తున్నాడు .
ఇంకేముంది గంతులేసుకుంటూ నాతో పాటూ బండి ఎక్కించుకొని తీసుకొచ్చేసా కన్నయ్యని ,
అత్తగారు ఫోను చేస్తే,
"ఇలాగ,కన్నయ్య దొరికాడు అని చెప్పాను".
"ధనుర్మాసం కదా మనింటికి కన్నయ్య వచ్చాడులే "అన్నారు మా అత్తగారు నా సంబరాన్ని రెట్టింపు చేస్తూ..
చక్కగా స్నానం చేయించి, బొట్టూ కాటుక దిద్ది ,బట్టలు తొడిగి,పూసలతో అలంకరించి,తలపాగా చుట్టి,నెమలి పింఛం పెట్టి,
చేతికొక మురళి ఇచ్చి ఊదుకోమని,
"అనుకోకుండా వచ్చావు పెట్టడానికి ఎమీ లేవు.
ఏమనుకోకే ముక్కోటేకాదశి రోజు పాయసం చేస్తాగా ఈ రోజుకి ఈ పటికబెల్లంతో సరిపుచ్చుకో"మని చెప్పి, మందిరంలోకి పంపించా,బుద్ధిగా వెళ్ళి ఎలా మందిరంలో నించున్నడో చూడండి అల్లరివాడు.
వేణువూదుతూ,నవ్వు వెలుగుతున్న నా కన్నయ్య ప్రశాంత వదనాన్ని చూస్తూ
ఓ దణ్ణమెట్టుకున్నాను.
కన్నయ్యను నాకు దొరకబుచ్చిన శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోలెడు థాంక్సులు .:)
నా కన్నయ్య మీకూ నచ్చాడా మరీ..??
ఆయ్ మాకు నచ్చారండి ధాత్రి గారు
రిప్లయితొలగించండిమీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండి.
తొలగించండిCute kannayya.bhale unnadu
రిప్లయితొలగించండికదాండి..Thank You..:))
తొలగించండికృష్ణం వందే జగద్గురుం....@శ్రీ
రిప్లయితొలగించండి:))
తొలగించండిchaala baga nachadu..
రిప్లయితొలగించండిధన్యవాదాలు రమణి గారు..:))
తొలగించండిbhale undandi mee mandiram.chinnaga.
రిప్లయితొలగించండి:))))
తొలగించండిMeeku elanti vigraha pratimalu, mandiraalu kaavalanna mumbai lo milan subway loni service road lo dorukutai. more than 25 shops carryout these works.
రిప్లయితొలగించండిThank You for Your Info..Prasad (ప్రసాద్ భళ్ళమూడి) gaaru..
తొలగించండిపేరుకు తగ్గట్టే మీ బ్లాగు చాలా తీపి .మీ కన్నయ్య చల్లనిచూపు ఎప్పుడూ మీమీద ఉండాలి .
రిప్లయితొలగించండి