జారు పమిట చూసి వెన్నెల రేడు నవ్వుతున్నా..
విచ్చుకున్న సన్నజాజులెక్కడికని ఆరా తీసినా..
చిరుచెమట కరిగిన కస్తూరి గుభాళించి గుట్టు రట్టవుతున్నా ..
గుదిగుచ్చిన మాలికనుండి ఒక్కో ముత్యం జారిపడుతున్నా..
పిల్లతిమ్మెరలు చిగురుటధరాలను వణికిస్తున్నా ..
భువి సింగరించుకున్న పున్నాగలు లత్తుకపదములను అడ్డుకున్నా ..
నీకై చేబూనిన కడువలోని నవనీతం నా మానసమల్లే పొంగుతున్నా..
నీ వేణు గాన పిలుపులు విని ,
పరుగు పరుగున వచ్చాను కన్నా..
నీ నవ్వుల వెన్నెల వానలో తడువనిస్తావనీ ..
నీ అధర తేనియల మధురిమలో తేలియాడనిస్తావనీ. .
నీ ముద్దు మోమును నా కంటిపాప అద్దమున వీక్షిస్తావనీ..
నీ ముకుంద ముగ్ధ చరణాల అరుణిమ చెంతింత చోటిస్తావనీ..
ఈ క్షణాన మాత్రమే కాదు సుమా !
కడవరకూ ....
ఈ 'రాధా'కుసుమ పరిమళం పూర్తిగా ఆవిరయ్యేంతవరకూ..
చిత్రాలు:
ఇది నేను ఇంటర్ చదువుతుండగా వేసుకున్న చిత్రం.
అప్పుడప్పుడే వాటర్ పెయింట్స్ దాటి ఫాబ్రిక్ పెయింట్స్ మొదలు పెట్టాను..
ఎందుకో చిత్రకళంటే ప్రత్యేకమైన అభిమానం.
ఎక్కడా నేర్చుకొనే అవకాశం రాలేదు..ఇప్పుడు నేర్చుకుందామంటే సమయం చిక్కట్లేదు.
పెద్దగా పరిపక్వత లేకపోయినా ఇలా మీతో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నాను..
nice one...ee post tho meeru artist ani kuda arthamavuthundi...nice art
రిప్లయితొలగించండిఏదో మీ అభిమానమండి.ధన్యవాదాలు..:)
తొలగించండిhi daathri garu, meru rasina ee kavitha chala bagundi, koncham words artham chesukodaniki chinna ibbandi, mee art kuda chala bagundi, nice pic and nice kavitha
రిప్లయితొలగించండిHello,
తొలగించండిపార్వతిగారూ..కవిత..చిత్రం రెండూ మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు..:))
very nice! poetry chaalaa baavundi.
రిప్లయితొలగించండిkeep Blogging.
మీ ప్రొత్సాహానికి ధన్యవాదాలు వనజ గారూ...
తొలగించండితప్పకుండా రాస్తానండి:))
చక్కని చిత్రం.
రిప్లయితొలగించండిఇంకా చక్కని కవిత.
చాలా చాలా బాగున్నాయి ధాత్రిగారు.
మీ వాఖ్య కూడా ఇంచక్కగా ఉంది..:)
తొలగించండిధన్యవాదాలు..:))
You are very talented Dhaatri gaaru. Paitings, kavita anni chakkagaa unnaayi. I loved the song too. Private song?
రిప్లయితొలగించండికవితని..చిత్రాన్ని మెచ్చిన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు వెన్నెల గారు.
తొలగించండిపాట..
ఇళాయరాజా స్వరపరిచిన 'గుండెల్లో గోదారీ' సినిమాలోనిదండి..:))
Awesome Poetry.chala bagundi.
రిప్లయితొలగించండిMany Thanks...:)
తొలగించండిచాలా బాగుంది ధాత్రి గారూ!
రిప్లయితొలగించండిపెయింటింగ్స్ బాగున్నాయి..
ఈ క్షణాన్నే కాదు...కడవరకూ...
కవితా భావం ఆసాంతం చాలా చాలా బాగుంది...@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు.
తొలగించండిచిత్రం నచ్చినందుకు
కవిత మెచ్చినందుకు..:))
I love the emotion behind ur post... :) nice post..and the paintings too.. love them :)btw.. u can have your own exclusive style of art if you dont learn it from anyone.. dont need to worry abt that at all..
రిప్లయితొలగించండినా బ్లాగుకి స్వాగతం అనంత్ గారు..
తొలగించండిThank You sooooooooo much for your beautiful comment..:))