కలువ పూవులు,తామర పూవులు సాక్షాత్ లక్ష్మీ స్వరూపాలు,వీటిని దేవతా పుష్పాలు అంటారు కూడా.
వినయక చవితికి చిన్నప్పుడు మన ఊర్లో చెరువుల్లోంచి బోలెడన్ని పువ్వులు తీసుకొచ్చి పూజలు చేసేవారు కదా.
అలంటి కలువపూలు మన ఇంట్లో పూస్తే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా..
దీనికి పెద్ద పెద్ద ఇళ్ళు,స్థలాలు అక్కర్లేదండోయ్.మనం ఉన్న చోటే ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టి పట్టే చోటు చాలు.కాకపోతే అక్కడ బాగా ఎండ మాత్రం పడేలా ఉండాలి.
ఒక పెద్ద ప్లాస్టిక్ తొట్టె తీసుకొండి.కింద చూపించిన పరిమాణంలో లేదా అంతకన్న పెద్దది మీ స్థలాన్ని బట్టి అన్నమాట.
ఇది నేను పెంచుతున్న కలువ పూల తొట్టి |
ఇప్పుడు తొట్టిని సగం కంటే కొంచెం ఎక్కువ భాగన్ని నల్లమట్టితో నింపండి(ఎర్రమట్టి పనికి రాదు).తర్వత కలువ పూల మొక్కలను తొట్టి అంచుల దగ్గర పాతండి.అంటే మొక్క మొదలు తొట్టి అంచు దగ్గర ఉండాలి.ఆకులు లోపలికి తేలియాడేలా ఉండాలి.పైన చూపించిన తొట్టి పరిమాణానికి రెండు మొక్కలు పడతాయి.మొక్కలను పాతిన తర్వాత మట్టి పైన జాగ్రత్తగా గులకరాళ్ళను వెయ్యాలి.
ఇలా కలువ పూల తొట్టి సిద్ధమైపోయిందన్నమాట.
ఆహా అప్పుడే అయిపోలేదు.
ఇంటి ముందు ఇలా నీరు నిలువ ఉంటే దోమల బెడద కదా..అందుకని ఇలా తొట్టి సిద్ధమైన ఒకటి రెండు రోజులకి నీళ్ళు బాగా తేరుకుంటాయి.అప్పుడు 'గప్పీస్' అనే చిన్న చిన్న (అక్వేరియం షాపులలో దొరుకుతాయి) చేపలను తొట్టిలో వెయ్యండి.ఈ చేపలకు మేత ఎమీ అవసరం లేదు కానీ అప్పుడప్పుడు బిస్కట్ పొడిని వెయ్యండి. ఒక మూడు జతలు తెచ్చి వేస్తే చాలు బోలెడన్ని పిల్లల్ని పెట్టెస్తాయి.రంగుల రంగుల తోకలతో భలే ఉంటాయి.ఇవి ఒకటి నించి రెండు సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతాయి.కలువ పూల తొట్టెలోనికి ఇవే అనువైనవి.
జాగ్రత్తలు
1.తొట్టెకి నిరంతరం ఎండ బాగా తగిలేలా చూసుకోవాలి.కానీసం రోజులో ఆరు గంటలు ఎండ తగిలితే పూలు బాగా పూస్తాయి.
2.పాడైపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి.
3.నీటీలో పెరిగే నాచు వంటి మొక్కలను కూడా ఎప్పటికప్పుడు తొలగించాలి.
4.చలికాలం వీటిని జాగ్రత్తగ్గా కాపాడుకోవాలి ఈ కాలంలో పువ్వులు పూయవు.ఆకులు కూడా చిన్నగా అయిపోతాయి
కలువ పువ్వుల మొక్కలు ఇప్పుడు రకరకాల రంగుల్లో నర్సరీలలో దొరుకుతున్నాయి.ఇప్పుడు చలికాలం వెల్ళిపోతుంది కదా..
ఇంకెందుకాలశ్యం? కలువ పూల తొట్టిని పెట్టేసి ..లోగిలిలో పూచిన కలువలను చూస్తూ పుస్తకాలే చదువుకుంటారో.."కెరటాల వెలుగు చెంగలువా" అని పాడుకుంటూ...కాఫిలే తాగుతారో..కెమేరా పట్టుకొని వాటి చుట్టూ తిరుగుతారో..వాటి అందానికి వాటినే చుస్తూ ఇవన్నీ మర్చిపోతారో మీ ఇష్టం ..:))
ప్రకృతి అందాలలో కలువ పూలది ప్రత్యేకమైన అందం. కలువ పూల పెంపకం మీద మీ టపా ముచ్చటగా ఉంది ధన్యవాదాలు
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు నవజీవన్ గారు..:)
తొలగించుబాగున్నాయోచ్.
ప్రత్యుత్తరంతొలగించుతాతగారికి ధన్యవాదాలోచ్..:)
తొలగించుపసుపు రంగు కలువ పువ్వుల మొక్కలు చాలా బాగున్నాయండి.
ప్రత్యుత్తరంతొలగించునా బ్లాగుకి స్వాగతం anrd గారు..వ్యాఖ్యకు ధన్యవాదాలు..:)
తొలగించుకలువ పూవుల తొట్టె గాజుదైతే అందులో చేపలు బాగా కనబడతాయి కదా? అప్పుడు ఒక అక్వారియం, పూల తొట్టే రెండు పక్షులు ఒకే దెబ్బకి :-)
ప్రత్యుత్తరంతొలగించుఆరుబయిట గాజు తొట్టె పెట్టలంటే బోలెడు కష్టాలండీ బాబోయ్..ఎండకి బాగా వేడెక్కిన గాజు తొట్టెపై ఒక్క నీటి బొట్టు చాలు కొంపలు ముంచడానికి..:))
తొలగించుకానీ మీ ఆలోచనకు ఇంకో మార్గం ఉందండోయ్..పారదర్శక ప్లాస్టిక్ తొట్టెను పెట్టుకోవొచ్చు ..:))
super
ప్రత్యుత్తరంతొలగించునా బ్లాగుకి సుస్వాగతం మైత్రేయి గారు..:))
తొలగించుమీరు రాసింది చదువుతుంటేనే ముచ్చటగా పెంచాలనిపిస్తుంది...ఇంక కలువల్ని పూయిస్తే ఎంత ముద్దొస్తాయో :-)
ప్రత్యుత్తరంతొలగించుఆ పూచిన కలువల్ని చూసి మీరు రాయబోయే కవితలు ఇంకెంత మురిపిస్తాయో :))
తొలగించుధన్యవాదాలు పద్మర్పిత గారు
ధాత్రి గారు,కలువలు ఇలా ఇంట్లో పెంచుకోవచ్చు అన్న విషయం మీ టపా చదివిన తర్వాతే తెలిసింది. చాలా నచ్చింది.
ప్రత్యుత్తరంతొలగించుహహ్హ..:)
తొలగించుధన్యవాదాలు చిన్ని గారు..:)
చాలా బాగున్నాయి అండీ!
ప్రత్యుత్తరంతొలగించువెంటనే మొక్కలని పెంచి పూలు పూయించాలని ఉంది.
వనమాలి పూయించగలేని కలువ గలదే..??
తొలగించుమీదే ఆలశ్యం..
ధన్యవాదాలు వనజ గారు వ్యాఖ్యకు..:)
so nice..:), baagunayandi mee kaluvupuvvula pempakam, danipaina jagrattalu
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు పార్వతి గారు మీ వ్యాఖ్యకు..:)
తొలగించులోటస్ ఫ్లవర్ అంటే నాక్కూడా చాల ఇష్టం! కృష్ణ మందిరం లో ఎక్కువగా ఉంటాయి
ప్రత్యుత్తరంతొలగించుపింక్ లో ఎక్కువగా చూడటమేఈ కలర్ కూడా చాలా బావుంది
మీ జాగ్రత్తలకి జేజేలు :)
కామెంటినందుకు ధన్యవాదాలు హరేకృష్ణ గారు..:)
తొలగించునా యుగయుగాల కోరిక ఇది :) త్వరలో తీర్చుకోబోతున్నానులెండి !
ప్రత్యుత్తరంతొలగించుమీ బుజ్జి కొలను బావుంది :)
కోరిక తీరిన తర్వాత మాకు కూడా చూపించండీ..ధన్యవాదాల్య్ వ్యాఖ్యకు తృష్ణ గారు..:)
తొలగించుnice
ప్రత్యుత్తరంతొలగించుచాలా బాగుంది
ప్రత్యుత్తరంతొలగించుఈ తామర, కలువలు తొట్టెలొ పెంపకం పద్ధతి చాల బాగుంది. ఎండలో నీరు నాచు పట్టెస్తుందెమో అని అనుకుంటున్నాను. ఈపద్ధతి పాటించి చూస్తాను. ధన్యవాదాలు
ప్రత్యుత్తరంతొలగించునేను తామర దుంపలను ఆకులతో పాటె కడియం నర్సరీ నించి తెఛ్చాను అవి మామూలుగా ప్లాస్టిక్ తొట్టెలో పెట్టి కొంత నల్లమట్టి నీరు దుంపలుమునెగె వరకుపోశాను. కానీ 10 నిముషాల లోపులోనే ఆ ఆకులన్ని మాడి పోయినట్టు అయి పోయాయి. ఆకాడలు కట్ చేసి అలానే తొట్టెను ఎండలో ఉంచాను. అవి మళ్లీ బాటుకుతాయా ? ఏమి చేయాలి చెప్పగలరు
ప్రత్యుత్తరంతొలగించుఈకలువ, తామర పూల మొక్కలు హైదరాబాదు లొ ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్పగలరా?
ప్రత్యుత్తరంతొలగించునెనురెండు తొట్టెలలో తామర కలువసీడ్స్ వేశాను ఆకులు బాగావచ్చాయి కానీ పూలు రావటంలేదు ఈమధ్యరేడు కలువమొగ్గలు వచ్చాయి కానీ నిలువ లేదు.NPK ఎరువు పేపర్లో కట్టి వేశాము. ఈతొట్టెలు రెండు పైన డాబా మీద ఎండ తగిలే వహాట్ పెట్టాము. ఇది పెట్టి 6నెలలు పైనే అయింది. సరిఅయిన సలహా ఇవ్వగలరు.
ప్రత్యుత్తరంతొలగించు