అనగనగనగా..
అప్పుడు నాకు అయిదేళ్ళన్నమాట..
నాకు బడికెళ్ళే ఈడొచ్చిందని అక్షరాభ్యాసం చేయించి, స్కులులో ఎల్కేజి లో జాయిన్ చేసారు.
మొదటి రోజు కొత్త బ్యాగు..కొత్త పుస్తకాలు,కొత్త షూలు ఇవన్నిటితో పాటూ అందరికీ పంచడానికి చాక్లెట్లు ..బిస్కెట్లు పాకెట్లు ఇలా అమ్మ బొలేడు ఇచ్చేసరికి నాన్నారి సైకిలెక్కి గంతులేసుకుంటూ స్కూలుకెళ్ళాను.
అందరికీ చాక్లెట్లు,బిస్క్లెట్లు పంచుతాం కదా.అలా పంచేయగా ఇంకా పాకెట్లో బొలేడు ఉన్నాయి.
"అబ్బ ఇవన్నీ నాకే ఇంచక్కా తినొచ్చు ఎన్ని ఉన్నయో"
అని నేను తెగ సంబరపడిపోతుంటే
"ఏయ్ అవన్నీ నాకిచ్చేయ్."అని ఒక గొంతు వినబడింది.ఎవరా అని తల పక్కకి తిప్పి చుస్తే,
పెద్ద పెద్ద కళ్ళు ..బాబ్ హైర్ కట్తో ఒక అమ్మాయి చంద్రముఖిలాగా ఆ కళ్ళు ఇంకా పెద్దవి చేసి నన్నే చూస్తూ అడుగుతుంది.
ఆ అమ్మాయి రెండవ తరగతి.అంటే నాకంటే మూడేళ్ళు పెద్దదన్నమాట.ఆ అలుసుతోనో..లేకపోతె నేను మరీ అంజలి పాపలా కనిపించానో ఎమో??
ఇక మొదలయ్యింది నామీద ఆవిడగారి గూండాగిరి.
రోజు అమ్మ ఇచ్చే చాక్లెట్లు మొదలగు చిరుతిండి అంతా లాగేసుకొనేది.పొరపాటున ఇవ్వనన్నా,దాచుకున్నా ఒక పొద చాటుకి తీసుకెళ్ళి బాగా కొట్టేది.రోజూ ఇదే తంతు.
మనం అమ్మ దగ్గరో,టీచర్ దగ్గరో నోరు మెదపొచ్చు కదా..
యబ్బే..
చక్కగా రోజు ఆ అమ్మాయికి నా చిరుతిండంతా ఇచ్చేసి,ఇంచక్కగా పొదచాటుకెళ్ళి కొట్టించుకొని,ఆ పొద చాటునే బేర్ బేర్ మని ఎడ్చేసి, లోపల మొగుడు తన్నినా పదిమందిముందూ నవ్వుతూ కనిపించే మహాపతివ్రత రేంజులో పొద బయటకు నవ్వుతూ వచ్చేదాన్ని
.ఒక్క చిరుతిండే కాదు పెన్సిళ్ళు ..బలపాలు అన్నీ లాగేసుకొనేది.
నేను రోజూ స్కూలుకెళ్ళనని ఏడ్చేదాన్ని.
ఇలా క్షణమొక గండంగా రోజులు గడుస్తుండగా..
ఒక రోజు ఆ అమ్మయికి పిచ్చి బాగా ప్రకోపించింది .
నేను ఆరోజుకి నా చిరుతిండంతా ఇచ్చేసినా ,
"నా దగ్గర ఇంకేమీ లేవే నా సాడిష్టు తల్లో.నన్నొగ్గేయవే నా చంద్రముఖో"
అన్నా వినకుండా నన్ను పొద చాటుకు లాక్కేళ్ళింది.
"ఏమే నీకు నేను ఆషామాషిగా కనబడుతున్ననా" అంది.
"నేనేం చేసాను" అన్నాను భయంగా
"నువ్వు కాదే ఆ టీచర్ది హోం వర్క్ చేయలేదని నన్ను తిడుతుందా"
అని నన్ను వంగోబెట్టి ఒక్క వీపు విమానం మోత మోగించింది.
నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
"ఎన్నాళ్ళు..ఇంకెనాళ్ళు నీ దురాగతాలు??ఈ అన్యాయాన్ని నేను సహింపజాల" అని..
టీచర్ దగ్గరకెళ్ళి
"ఈ అమ్మాయి నన్ను కొడుతుంది " అని చెప్పాను.
"తప్పమ్మా ఇద్దరు కలిసుండాలి.ఇలా ఒకరిమీద ఒకరు చెప్పుకోకూడదు" అని చెప్పి,
ఒకరి చేత ఒకరికి కరచాలనాలు చేయించి,మా మద్య స్నేహాన్ని చిగురింపజేసి ఇద్దరినీ క్లాసులకి పంపించేసింది. నేను బిక్కు బిక్కుమంటూ క్లాసుకేసి నడుస్తున్నాను.
టీచర్కి చెప్పాను కదా మన చంద్రముఖి సాడిజం ఉగ్ర రూపం దాల్చింది.
పొద చాటుకి తీసుకెళ్ళి బ్లేడుతో పర పర మని చేతి మీద కోసేసి,నా పీక పట్టుకుంది.
అంతే నేను అరిచిన అరుపు మొత్తం స్కూలు అంతా అక్కడ ప్రత్యక్షం అయ్యింది.
సాడిస్టు చంద్రముఖి అలా ప్రత్యక్షంగా దొరికిపోయింది.
తర్వత ఆ అమ్మాయిని స్కూలు వాళ్ళు పంపించేసారు.
నెల రోజుల టార్చర్కి అల తెర పడింది.
కాని నేను మాత్రం ఆ స్కూలుకి చచ్చినా వెళ్ళనని కూర్చున్నా.
ఇంకేంచేస్తారు అమ్మావాళ్ళు.ఈసారి ఒక్కదాన్నే ఎందుకని నాతో పాటూ చెల్లినీ కలిపి ఒకే స్కూలులో వేసేసారు.
తర్వాత ఒక సంవత్సరకాలం
" నన్ను కొట్టొద్దు. గిల్లొద్దు. రక్కొద్దు" అని కలవరిస్తునే ఉన్నా.
ఇప్పటికీ ఆ చంద్రముఖి కళ్ళు నేను మర్చిపోలేను.
ఇందువలనచేత..
నేను చెప్పొచ్చేదేమిటంటే మీ పిల్లలు చదువుతున్న స్కూలులో ఇలాంటి పనులు చేసే పిల్లలు కూడా ఉండొచ్చు.మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండోయ్.పిల్లలు అన్నీ చెప్పలేరు.మనమే అన్నీ ప్రశ్నలు వేసి తెలుసుకోవాలి.
మీకు తెలిసిన విషయమే ఒకసారి గుర్తు చేస్తున్నా ..
పిల్లలు జర బధ్రం.
ayyo papam.:(
రిప్లయితొలగించండిపాపం కదాండి నేను..:((
తొలగించండిధన్యవాదాలు..:)
వామ్మో.. ఇలా కూడా ఉంటారాండీ??!!!!
రిప్లయితొలగించండిఉంటారండీ బాబోయ్..
తొలగించండివ్యాఖ్యకు ధన్యవాదాలు ప్రియ గారు..:))
3lok likes 'అలా జరిగిందన్నమాట'
రిప్లయితొలగించండిధాత్రి likes '3lok comment'...:)
తొలగించండిidi nijama leka katha na??????//
రిప్లయితొలగించండినిజమండీ బాబోయ్.సంభాషణలు అవే కాకపోయినా సంగతులు మాత్రం నిజం.నమ్మాలి మీరు..:(
తొలగించండివామ్మో.....మీరు భలే ధైర్యవంతులే:-) శభాష్ ధాత్రి పాప(అప్పటి)
రిప్లయితొలగించండిఅంతేనంటారా??
తొలగించండిధాత్రి పాపకి ఇచ్చిన శభాషులకు ధన్యవాదాలు...:))
హాయ్ ధాత్రి గారు, నిజమా లేక కల్పితమా?? నిజమే అయితే మీ సహనానికి జోహారు..అయినా వెంటనే మీ టీచర్ కు చెప్పి మంచి పని చేశారు.
రిప్లయితొలగించండినిజ్జంగా నిజమండి.
తొలగించండినిజం కాబట్టి జోహార్లు నాకే..:)
ధన్యవాదాలు చిన్ని గారు
finally chepesav annamatta..chaala bagundi..
రిప్లయితొలగించండిThank You Dear...:))
తొలగించండి"నా దగ్గర ఇంకేమీ లేవే నా సాడిష్టు తల్లో.నన్నొగ్గేయవే నా చంద్రముఖో" rofl
రిప్లయితొలగించండిlol..:) Thank You..Sirisha gaaru..:D
తొలగించండిపాపం అంత చిన్న వయసులో ఎన్ని కస్టాలు పడ్డారండి, మీ ఒర్పు కి కి కి ...............:))))))))))),
రిప్లయితొలగించండిఅవునండి..పాపం కదాండి నేను..:(
తొలగించండి