అవును ఇంజెక్షన్ అంటే మాదీ అదే రియాక్షన్ అంటారా..?
అది ఇంజెక్షన్ చేయించుకొనే ముందు మీ రియాక్షన్ అయ్యిండొచ్చు గాక..
కానీ నా విషయంలో సీన్ రివెర్స్.
ఇది నాకు ఇంజక్షన్ చేసే ముందు మా డాక్టారు గారి రియాక్షను.
అదెలా అంటే నెను ఫ్లాష్బాక్లోకి వెళ్ళాలి మరీ..
టపా తెరిచాక వెళ్ళక ఛస్తామా అని మీరు అంటారని నాకు తెలుసు..మరి నాతో పాటూ వచ్చేయండి.
అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు.
అప్పుడు నాకు మూడు రోజులపాటూ తీవ్రమైన జ్వరం వచ్చింది.(నాలిగోతరగతి అయితే నాలుగు రోజులు వచ్చేదా అంటే నేను చెప్పలేను.).
ఇక లాభం లేదు అని మా ఊరికి ఉన్న ఏకైక డాక్టరు కం మా ఫామిలీ డాక్టరుని (ఊరందరికి ఒకే డాక్టరు అయితే ..మీ ఫామిలీ డాక్టరేమిటో అనకండి.అదేదో ఆయనతో ఉన్న చనువుకొద్దీ మా ఫీలింగ్ ).పిలిపించారు.పాపం ఆయన బక్కపలచ మనిషి అయితేనేం రావడంతోనే చెయ్యి చూసి ఇంతలావు ఇంజక్షన్ బుడ్డీని పగలగొట్టి అంతకంటే లావున్న సిరంజ్లోకి ఎక్కిస్తున్నాడు.
అంత పెద్ద సూది నా ఒంట్లో దిగబోతుందనే ఆలోచనతోనే నాకు చెమటలు పట్టేసాయి.
ఇక నేను పీటీఉష రేంజ్లో పరుగు లంకించుకున్నా..ఇంటి చుట్టు తిరిగుతున్నా.ఆ సూది పట్టుకొని మా బక్కపలచ డాక్టరు కూడ తిరుగుతున్నారు.అయనకి ఎంతసేపటికి దొరకకపోవడంతో అమ్మ,నాన్న కూడా దిగారు రంగంలోకి.నేను ఇల్లు దాటి తోటలోకి పారిపోయి దాక్కున్నా..డాక్టారు వెళ్ళిపోవడం చూసిన తర్వత కానీ..నేను బయటకు రాలేదు.
ఆ రోజుకి అలా తప్పించుకున్నా..కానీ అలా పరుగు పెట్టడం వలనేమో నా జ్వరం ఇంకా ఎక్కువైంది.
మరుసటి రోజు నేను పొద్దున్నే వెచ్చగా ఉన్న దుప్పట్లోంచి బద్దకంగా లెగుద్దామంటే ఎవరో నా చేతులు బలవంతంగా పట్టుకున్న ఫీలింగ్..ఎమిటా అని కళ్ళు తెరిస్తే..ఎదురుగా పట్టువదలని విక్రమార్కుడు కత్తి పట్టుకున్నట్లు సిరంజ్ పట్టుకొన్న మా బక్కపలచ డాక్టారు..:(.
సరే ఏదోలా తప్పించుకుందాం అని లేవబోతుంతే అమ్మ నాన్న నా చేతులు ఇంకా గట్టిగా పట్టేసుకున్నారు..
పక్కన చూస్తే చెల్లితో పాటూ అన్నయ్య,అక్క( పెదనాన్నగారి పిల్లలు)ఇంకా మావయ్య.:(..
విధి ఎంత బలీయమైనది .మందీమార్బలంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేసారు.ఈ పద్మవ్యూహంలోంచి ఎలా తప్పించుకోవాలబ్బా అని నేను ఆలోచిస్తుండగానే
అన్నయ్య,అక్క రెండు కాళ్ళూ పట్టేసుకున్నరు..మా బుడ్డిది(చెల్లి) దానికేం అర్దమైందో కానీ వాళ్ళకి తెగ సాయం చెసేస్తుంది...బహుశా నా మీద పగతీర్చుకోవడంలో ఇది ఒక భాగమైయుండొచ్చు దానికి..:( మవయ్య నా తల పట్టుకున్నాడు.అంతే
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.....ఇల్లు ఎగిరిపోయేలా పెద్ద కేక..
ఇంజక్షన్ అయిపోయింది .మా డాక్టారు గారు పెద్ద ఆపరేషన్ చేసేసిన రేంజ్లో విజయ దరహాసాలను చిందించుచున్నారు.
నేను బేర్ బేర్ మని ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను.
ఆ రోజూనించీ మా డాక్టారు గారిమీద పగతో రగిలిపోయేదాని..
ఇప్పుడు మనం అయిదో తరగతికి వచ్చేసాం అన్నమట..మాయదారి జ్వరం మళ్ళీ వచ్చింది.మళ్ళీ వచ్చారు డాక్టారుగారు..
ఎక్కించేస్తున్నాడు ఇంజక్షన్ సిరంజ్లోకి..
హన్నా ఆ రోజు నన్ను నిస్సహాయురాలిని చేసి మా వాళ్ళందరినీ ఉసిగొల్పి ఆ సూదిని నా ఒంట్లో దింపుతావా..
ఈ రోజు వాళ్ళెవరూ లేరు (నాన్న ఊరెళ్లారు..అమ్మ చెల్లి మాత్రమే ఉన్నారు)..
చెప్తా నీ సంగతి..
ఇలా నేను ఆలోచిస్తుంటే ఆయన సిరంజ్ తీసుకొని వస్తున్నడు నా దగ్గరికి ..
వచ్చేసున్నాడు..పారిపోదామంటే అమ్మ పట్టేసుకుంది.
ఏం చెయ్యాలీ..ఏం చెయ్యాలీ..
నాలో ఉన్న బలన్నంతా ఉపయోగించి డాక్టారుగారి చెంప మీద ఒక్కటిచ్చా.
పాపం అసలే బక్కపలచ మనిషి ఊహించని ఈ దెబ్బకి ఆయనకి దిమ్మ తిరిగి ఎగిరెళ్ళి మంచం మీద పడ్డాడు.
అయ్యో అని అమ్మ నా చెయ్యి వదిలేసి అయన దగ్గరికి వెళ్ళింది ఇంకే మనం ఎంచక్కా జంపు..
తర్వాత నాన్నగారు వచ్చి జరిగింది తెలుసుకొని ఆయన ఇంటికి నన్ను తీసుకెళ్ళి సారీ చెప్పించారనుకోండి.కానీ మా డాక్టారు గారు పాపం బాగా బెదిరిపోయారు చాలా రోజులు మా ఇంటికి వస్తే ఒట్టు.
అప్పటినించీ నాకు ఇంజక్షన్ చెయ్యాలంటే
"అమ్మో మీ పెద్దమ్మాయికి ఇంజక్షనా మీరు దగ్గరుండండి ప్లీజ్" అని అడుగుతారు నాన్నగారిని.
ఇప్పటికీ టాబ్లెట్స్ ఎన్నైనా వేసుకుంటా కానీ..ఇంజక్షన్ అంటే చేసేవారిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి,హారర్ కం సస్పెన్స్ కం థ్రిల్లర్ సినిమా చూపించి కానీ చేయించుకోను.
గద్గది ఇస్టోరీ..
ala janalni manhandle chesthunnavannamata
రిప్లయితొలగించండిedonandi ala jarigipoayindi..:)
తొలగించండిధాత్రి గారు, డాక్టర్ని ఇంతలా హడలెత్తించేసారా?
రిప్లయితొలగించండిమరీ..ఇంజక్షన్ అంటే ఊరుకుంటామా..??
తొలగించండివ్యాఖ్యకు ధన్యవాదాలు చిన్ని గారు..:)
ధాత్రి గారు.. చాలా బాగుందండీ.. మీ చెల్లెలు మీ కంటే ఏ మాత్రం చిన్నది ఏమిటి? :/
రిప్లయితొలగించండి:) :)
తొలగించండివామ్మో.. ఇంజక్షన్ అంటే నాతో సహా చాలామందికి భయమే గానీ మీరు ఏకంగా డాక్టరు గారి చెంప చెళ్ళుమనిపించేసారన్నమాట.. :D
రిప్లయితొలగించండిచిన్నప్పుడంటే ఊరుకుంటారు కానీ మరిప్పటి పరిస్థితి ఏంటండీ? ;)
మీరు పెట్టిన స్మైలీలు భలే క్యూట్ గా ఉన్నాయి..
"ముందు ముందు ఏం చేస్తావో నేను చూస్తాను"అని అమ్మ కూడా అంటుదండి..మరి ఏం చేస్తానో..??:(
తొలగించండిస్మైలీలు నచ్చినందుకు ధన్యవాదాలు మధుర గారు..:)
హహహ! అర్భక డాక్టర్!
రిప్లయితొలగించండినాకు మాత్రం ఆ పిచ్చి, చేదు మాత్రల కన్నా ఇంజెక్షన్ అంటేనే చాలా ఇష్టం. అడిగి మరీ చేయించుకుంటాను :)
అయితే మీరు చాలా ధైర్యవంతులే అన్నమాట..:)
తొలగించండివ్యాఖ్యకు ధన్యవాదాలు రసజ్ఞ గారు..:):)
బాగుంది ధాత్రి గారు మీ టపా.. :)
రిప్లయితొలగించండిమీరు పరవాలేదండీ ఒక్క చెంప దెబ్బతో సరిపెట్టారు.. మాకు ఇంటికే వచ్చి వైద్యం చేసే డాక్టర్స్ ఉండేవారు కాదు గనుక కాస్త జలుబు చేసినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయేవారు! మా ఇంట్లో వాళ్లేనంటే ఇహ ఆ డాక్టర్ గారు మరీను.. ఈ జలుబుని ఇలాగే వదిలేస్తే రేపో ఎల్లుండో కచ్చితంగా ఇది జ్వరంగా మారుతుంది అని జడిపించేసి దీనికి ఏకైక సొల్యూషన్ ఇంజక్షనేనంటూ ఇంత లావు సిరంజి తీసుకొచ్చేవారు. నేనూరుకుంటానా.. ముందు ఏడుస్తూ బ్రతిమాలేదాన్ని తరువాత పారిపోవడానికి ప్రయతించి విఫలమై డాక్టర్ని, నర్సులను ఎగిరెగిరి తన్నేదాన్ని!! అదేవిటో మరి తన్నులైనా తినేవారు గాని ఇంట్లో వాళ్ళను మాత్రం లోపలికి రానిచ్చేవారు కాదు! తర్వాత్తర్వాత ఇంజక్షన్ మీద నాకే ఇష్టం పెరిగిపోయింది. రోజు టాబ్లెట్స్ వేసుకునే కంటే ఒక్క ఇంజక్షన్ తీసుకుని ఆ సింపతీ తో అమ్మ తో అవి ఇవీ కొనిపించుకోవడం మేలని ఫిక్స్ అయిపోయాను :P
సారీ ధాత్రి గారు.. మీ పోస్ట్ చూసేసరికి పాత విషయాలన్నీ గుర్తొచ్చి టపా లాటి కామెంట్ ని పోస్ట్ చేస్తున్నాను.. ఏమి అనుకోకండీ :)
నా టపా మీ బాల్యాన్ని గుర్తు చేస్తే నాకు ఆనందమేనండోయ్..సారి ఎందుకండి..
తొలగించండిమీ జ్ఞాపకాన్ని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రియ గారు....:)
ఏమి వ్రాశారండీ...సపోర్టింగ్ స్మైలీస్...ఇంకా సూపర్...అభినందనలు....:-)...@శ్రీ
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్రీ గారు..:):)
తొలగించండిHehe:) story bagundi...Smileys inka bagunai:)
రిప్లయితొలగించండిThank You Veena..:)
తొలగించండి:)
రిప్లయితొలగించండిటపా బావుంది
స్మైలీ పిక్స్ తగ్గిస్తే ఇంకా బావుంటుందని నా అభిప్రాయం
నా బ్లాగుకి స్వాగతమండి..వ్యాఖ్యకు ధన్యవాదాలు హరేకృష్ణ గారు..:)
తొలగించండిchala bagundi dathri garu, chadivina vallaki kevukekaaaaaaaaaaaaaaaa:)
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచాలా బాగుంది ధాత్రి గారు, ఇది చదివిన వారికి కెవ్వు కెకా కా.కా.కా....................
అంత కేక పెట్టించానంటారా..:)ధన్యవాదాలు పార్వతి గారు..:):)
తొలగించండిu have easy style of expressing the views like 'nemalikaanu'. Please write more...
రిప్లయితొలగించండిమీ ప్రొత్సాహానికి ధన్యవాదాలు సంజయ్ గారూ..తప్పకుండా రాస్తానండీ..:))
తొలగించండిsuperb writing ...kani ala kotadam enti andii...?
రిప్లయితొలగించండిధన్యవాదాలు సందీప్ గారు..పగతో కూడిన భయం వలన వచ్చిన తెగింపుతో కొట్టెసానండి..:P
తొలగించండిrofl... పగతో కూడిన భయం వలన వచ్చిన తెగింపు.. Trivikram gari dialogue kante bagundi,,
తొలగించండిSirisha
hahhaa..antenantaaraa??
తొలగించండిdoctor is so lucky...chempa debbatho saripettavu...meeku vunna bhayaniki aa injection doctor ki chesina chesthavu ;-)
రిప్లయితొలగించండిye naya angle hai..:))
తొలగించండిdhanyavaadaalu...
(నాలిగోతరగతి అయితే నాలుగు రోజులు వచ్చేదా అంటే నేను చెప్పలేను.). rofl
రిప్లయితొలగించండిహహ్హ..:)
తొలగించండిధన్యవాదాలు శిరీష గారు
Super, chalabagundandi. baga navvukunnanu.
రిప్లయితొలగించండిEmiti ee madya ratha taggindi :)
రిప్లయితొలగించండిఎమిటోనండి అలా అయిపోతుంది.. :(
తొలగించండి