చల్లటి గాలి..
సుతారంగా నన్ను తాకుతుంది.ఎందుకో నా మనసును ఆ గాలి తాకలేకపోతుంది.నా ఆలోచనల విహంగం నేల మీద ఈ రైలు కంటే వేగంగా పరుగెడుతుంది.ఇప్పుడు హఠత్తుగ్గా ఇంటికి వెళ్తే అమ్మెమంటుందో అసలు రానిస్తుందో లేదో? అయినా అమ్మకేంతెలుసు నా సమస్య.అసలు వాళ్ళకి నేనేమని చెప్పాలి?చెప్పినా అర్ధం చేసుకుంటారా?
ఎదో స్టేషన్లో రైలు ఆగింది.ట్రైన్ ఇంకా సిటీ దాటలేదు.ఎక్కేవాళ్ళు,మంచినీళ్ళ కోసం దిగేవాళ్ళు,నీళ్ళసీసాలు,చిప్సు,బిస్కెట్లు అమ్మేవాళ్ళు అంతా గందరగోళంగా ఉంది నా ఆలోచనల్లాగానే.నోరంతా ఎందుకో ఎండిపోతుంది.ఎందుకిలా?అరె నాకు దాహమేస్తుంది.నీళ్ళ బాటిల్ కొనుక్కుందామని లేవబోయను.రైలు కదిలిపోతుంది.
ఒక్కసారిగా ఏడుపొచ్చింది.రాధా గుర్తొస్తున్నాడు.
"వద్దు అతనికి నాకు ఏ సంబంధం లేదు గుర్తొచ్చినా, ఇవన్నీ తర్వాత అలవాటయిపోతాయి.జీవితంలో ఏమీ లేకుండా మట్టిముద్దలాగ బ్రతకడం నా వల్ల కాదు."
మనసు మాట వినడం లేదు.జ్ఞాపకాల పొరలను కదుపుతోంది.
నన్ను ప్రశ్నిస్తుంది.
"నిజం చెప్పు కృష్ణా.రాధా నువ్వు దాహం అంటే ఎడారిలో ఉన్నా నీళ్ళు తెచ్చిస్తాడు అవునా?"
"ఎమో.అయినా నువ్వేమిటి మధ్యలో.అసలే చిరాగ్గా ఉంది. అతనిని గుర్తుచెయ్యొద్దు అన్నానా?"
"తప్పించుకోకు.నాకు సమాధానం చెప్పు"
"అవునేమో."
కానీ అంగీకరించలేకపోతున్నాను.
రాధాది,నాది పెద్దలు చేసిన పెళ్ళి.ఎంసీయే రెండవ సంవత్సరంలో ఉండగా మా పిన్ని తీసుకొచ్చింది సంబంధం."కుర్రాడు కష్టపడి పైకి వచ్చాడు.పెద్ద కుటుంబం.బాధ్యత తెలిసిన వాడు.ఈ కాలంలో ఇలాంటి వాడు దొరకడు.పేర్లు కూడా బాగా కలిసాయి.రాధాకృష్ణా,కృష్ణప్రియా ఎంత బాగుందో.మా అత్తగారికి బాగా దగ్గరి వాళ్ళు." అని ఖాయం చేసేసింది.
ఇంకేంటి మా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.రాధా నాకంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు.చదువయ్యకే నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు.నాన్నాగారు చాలా సంతోషపడిపొయారు "నా కుతురి పట్ల నాలాగే ఆలోచించే అల్లుడు దొరికాడు" అని. ఆడపిల్లల ఊహల్లో ఉండే అబ్బాయిలాగ పెళ్ళికి తొందరపడలేదు రాధా .
"కాస్త జరగవమ్మా..పిల్లాడు కుర్చోవద్దూ?"
అని నా పక్కనావిడ ఒకరు పట్టే ఆ చొటులో ఆవిడ,ఆవిడ పదేళ్ళ పిల్లవాడితో కూర్చుంది.
కాసేపటికి
"ఏమయ్యో!నిన్నే ఇలా రా.ఈడ జాగా ఉంది."
ఎక్కడో దూరంగా చుట్ట కాలుస్తున్న ఒక నలబైయ్యేళ్ళ వ్యక్తిని పిలుస్తుంది..
ఎక్కడ ఉందో నాకు అర్దమయ్యేలోపే,ఆ పిల్లాడు ,తల్లీ అటు ఇటు జరిగారు ఆయన వచ్చి మధ్యలో కూర్చున్నాడు.ఒక పక్క కిటికీకి నొక్కుకుపోతుంటే ఆయన చుట్ట వాసన భరించలేకపోయాను.చేసేదేమీ లేక లేచి నించున్నా.
"ఛ రిజర్వేషన్ చేయించుకున్నా పోయేది.టైం కూడా లేదు.హడావిడి ప్రయాణం."మళ్ళి రాధా..నా మనసు అడుగుతుంది.
"రాధా అయితే రిజర్వేషన్ దొరకకపోతే ప్రయాణం కాన్సిల్ చేసేవాడు. తప్పనిసరిగా వెళ్ళాల్సిసొస్తే ఏ చుట్టాల దగ్గరో నిన్ను వదిలి తనే వెళ్ళేవాడు కానీ రిజర్వేషన్ లేకుండా ఎప్పుడూ రానివ్వలేదు కదా నిన్ను ?"
నిజమే.ఎప్పుడూ రానివ్వలేదు.ఒక్కమాటలో చెప్పాలంటే కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు నన్ను రాధా.అందరికీ అది అదృష్టంలా అనిపిస్తుంది.నాకు మాత్రం బంగారు పంజరంలా అనిపిస్తుంది.
ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఎక్కువగా ఫోనులు చేసేవాడు కాదు రాధా.అడిగితే నీ చదువు పాడవుతుంది జాగ్రత్తగా చదువుకో అనేవాడు. పాతికేళ్ళ వాడిలా కాక అరవయ్యేళ్ళ వాడిలా మాట్లాడేవాడు.కవితలు లేవు.పాటలు లేవు.కుర్చున్నా నించున్నా ఫొనులు లేవు.నా ఊహాపతి అయితే ఈ పాటికి నామీద కవితల పుస్తకం రాసేసేవాడు.నా స్నేహితులు వాళ్ళ ప్రేమికులు పంపే గ్రీటింగ్ కార్డులు,చేసే ఫొనులు చుస్తే చాలా బాధగా అనిపించేది.కానీ నా బాధ ఎవరికి అర్దం అవుతుంది.
చాలా సేపటినించీ నిల్చోవడం వలన కాళ్ళు లాగేస్తున్నాయి.టైం రాత్రి 10 కావస్తుంది.బాగా అకలి వేస్తుంది.
మళ్ళీ మనసు..
"పెళ్ళైన తర్వాత ఈ సంవత్సరకాలంలో నీకు ప్రయణాలలో కానీ,ఇంట్లో కానీ,సినిమాకి వెళ్ళినప్పుడు కానీ ఆకలి అంటే ఎమిటో తెలిసిందా?రాధా నీకు తెలియనిచ్చాడా?"
"తెలియనివ్వలేదు.." నా సమాధానం.
చుస్తూ ఉండగానే సంవత్సరం గడిచిపోయింది.పెళ్ళి అందరి ఆశీర్వాదాలతో జరిగిపోయింది.పెళ్ళైన తర్వాత ఇద్దరికీ హైదరాబాద్లో ఉద్యోగాలు..
ఎన్నో ఆశలతో, ఊసులతో రాధా ఇంట్లో అడుగు పెట్టాను.కానీ రాధా ఎక్కువగా మాట్లాడడు.మాట్లాడినా చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు.దేవుడిని నమ్మడు.చిన్నప్పటినించీ రాధా చాలా కష్టపడ్డాడు.వాళ్ళ కుటుంబం బాగా బతికిన కుటుంబం.చదువుకుంటూ ఉద్యోగం చే చేసుకుంటూ చాలా కష్టపడి పైకి వచ్చాడట.తను పడ్డ కష్టాలు,తీసుకున్న నిర్ణయాలూ ఎప్పుడన్నా ఇద్దరమే ఉంటే చెప్పేవాడు.నాకేమో కవితలు,బొమ్మలు,మొక్కలు, సంధ్యా సమయాలు,వెన్నెల్లో కబుర్లూ ఇవన్నీ తనతో పంచుకోవాలని ఉండేది.ఎప్పుడన్నా చెప్దామని ప్రయత్నించినా మౌనంగా వినేవాడు అంతే.నేను నా కవితలు ఎవేమీ అర్ధం కావు..పొనీ చెప్తే..
"సారీ రా..నాకు ఇవేమీ తెలీదు" ఒకటే మాట.
బాగా నిద్రొస్తుంది .ఆకలేస్తుంది..
పోనీ వచ్చే స్టేషన్లో దిగి ఎమన్నా కొనుక్కుందామా అనుకొని టైం చూసుకున్నా.10:30 అయ్యింది.
"తర్వాత స్టేషన్ ఎప్పుడు వస్తుందండీ?"
నా పక్కన నిల్చున్న ఆయనని అడిగాను.
"ఇంకో అరగంటలో వస్తుందమ్మా.అదే సిటీలో లాస్ట్ స్టేషను."
ఒంటరిదాన్ని అయిపోయాను.నా భావలను పంచుకొనే తోడు కోసం ఎన్ని కలలు కన్నాను.ఈయనకి ఎమీ అర్ధం కావే."భావుకతా? అంటే ఏమిటి ?"అడిగాడొకసారి.ఎడిస్తే ఓదార్పు ఉండదు.నా కన్నీటిని తుడవడు.అలిగితే బ్రతిమలాడడు.ఇంటిని నా సృజనాత్మకతతో అందంగా పెట్టినా గుర్తించడు. అన్నింటికీ మౌనం.ఎమన్నా అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా కుదరదు నాకు వాటి మీద నమ్మకం లేదు అంటాడు.నాకు నువ్వు కావాలి అని ఎప్పుడూ గట్టిగా చెప్పలేదు.విసిగిపోయాను..పెద్దగా అరిచాను.గొడవ చేసాను.అదే మౌనం.
"అసలు నా మీద నీకు ప్రేమ ఉందా"అడిగాను.
"నువ్వు ఇదే మౌనంతో ఉంటే నేను ఉండను.వెళ్ళిపోతాను "
ఇదే మాట చాలసార్లు అన్నాను ఇంతకుముందు.
మళ్ళీ అదే మౌనం..
నా అహం దెబ్బ తింది.ఆ మౌనం నా సహనన్ని పరిక్షిస్తుంది..ఆవేశం కట్టలు తెంచుకుంది.
ఆఫీసుకి వెళ్ళలేదు నేను.తను వెళ్ళాడు.నేను ఇంట్లో ఉండదలచుకోలెదు.
స్టేషన్ వచ్చింది.ఎమన్నా కొనుక్కుందామని దిగాను.స్టేషన్ చాలా చిన్నది.టైం 11:30 అవుతుంది.
ఎక్కడో దూరంగా ఉంది ఒక టీ స్టాల్.బిస్కెట్లయినా తీసుకుందామని వెళ్ళాను. ఒక గుడ్డే పేకెట్ తీసుకున్నాను..
ఇందాక సికింద్రాబాద్ స్టేషన్లో డ్రా చేసిన 500 నోటు ఇచ్చాను
"చిల్లర కావాలమ్మ" అన్నాడు..
"లేదు.చూడండి ఉంటుంది"..అన్నాను..
"లేదమ్మా."అన్నాడు.
ఏంచెయ్యలేక పేకెట్ అతనికి ఇచ్చేసి వెనక్కి తిరిగి చూసేసరికీ రైలు వెళ్ళిపోతుంది..
ఏంచెయ్యలో అర్ధం కాలేదు.పరుగు పెట్టాను.రైలు అందలేదు.ఇంకానయం చిన్న బాగ్ కాబట్టి బాగ్తో సహా దిగిపోయా.
దాహం..ఆకలి..తల తిరిగిపోతుంది.
"ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంటికి ఎల వెళ్ళాలి?పొనీ వెనక్కి రాధా దగ్గరికి వెళ్ళిపోదామా?"
టీ స్టాల్ అతనిని అడిగితే లోకల్ ట్రైన్కూడా ఎమీ లేవన్నాడు.3 గంటలకు ఒక రైలు ఉందంట.విజయవాడ వెళ్తుందంట.
"ఇప్పుడు వెనక్కి వెళ్ళిపొవాలా?లేకపోతే విజయవాడ వెళ్ళలా?"
ఆ టీ స్టాల్ పక్కనే,పున్నాగ పూల చెట్టు కింద ఉన్న బెంచీలో కూలబడిపోయాను.
ఇప్పుడు ఈ పున్నాగ పూల పరిమళం,చల్లటి గాలి ఇవేమి నేను ఆశ్వాదించలేకపోతున్నను.పరిస్థితుల ప్రభావం అని రాధా ఎప్పుడూ అనేది ఇదేనేమో. రాధా అన్నట్లు.జీవితం అంత సులువు కాదేమో.ఒక కష్టానికే నేను ఇలా ఆలోచిస్తుంటే,ఇంక రాధా అలా ఆలోచించడంలో తప్పు లేదేమో.స్టేషన్ అంతా నిర్మానుష్యంగా ఉంది.బహుశా ఇంకే లోకల్ ట్రైన్ లేకపోవడం వలనేమో.
టీ స్టాల్ అతని కళ్ళు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి.
"రాధా తొందరపడ్డానా?నాకు కష్టం తెలియకుండా చిన్న చిన్న పనులలో చూపించే నీ ప్రేమను అర్ధం చేసుకోలేకపొయానా?ఎక్కడ ఉన్నావు?కనీసం ఫోను కూడా చెయ్యలేదు ."
ఫొను తీసి చూసాను
50 మిస్డ్ కాల్స్
15 మెసేజస్
మధ్యాహ్నం రాధా ఫొను చేస్తే సైలెంట్లో పెట్టాను.మళ్ళీ తియ్యలేదు.మెసేజ్లు ఓపెన్ చేసాను
"కృష్ణా ఎక్కడికి వెళ్ళావు?"
5:30 సా
"కృష్ణ నీ కోసం ఒక సర్ప్రైజ్ .తొందరగా ఇంటికి రా .నేను నీ కోసం తొందరగా వచ్చెసాను.ఇంట్లో ఉన్నాను."
@5:48 సా
"నా మీద కో ంతో నాకు లంచ్ బాక్స్ కూడా ఇవ్వలేదు నువ్వు.నీ చేత్తోనే తిందామని ఏం తినలేదు నేను..తొందరగా రా..ఆకలేస్తుంది..:("
@6:00సా
"సారీ కృష్ణా.నాకు చిన్నప్పటినించి ప్రాక్టికల్గా ఆలోచించడం అలవాటు అయిపోయింది..నేను ఎందుకు మట్లాడనో తెలుసా..నాకు రాదు కృష్ణా..సారీ చెప్తున్నాను కదా.."
@6:15 సా
"కృష్ణా..నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా.పువ్వు పూసిన అనందపడిపోయే నీ చిన్నపిల్లల మనస్తత్వం..నీ బొమ్మలు,మొక్కలు,అర్ధం కాకపోయినా నీ కవితలు ఇవన్నీ నాకు చాల ఇష్టం కృష్ణ.నిన్ను బాధపెడుతున్నానని తెలుసు .కాని ఏం చేయను?నాకు చెప్పడం రాదు కృష్ణా.కానీ చిన్న చిన్న ఆనందాలు ఎలా ఉంటాయో నిన్ను చూసే నెర్చుకుంటున్నా."
@6:35 సా
"కృష్ణా రిప్లై అన్నా ఇవ్వు నాకు కంగారుగా ఉంది.నీ ఫ్రెండ్ లక్ష్మికి కూడా ఫోన్ చేసాను. రాలేదని చెప్పింది.నాకు భయమేస్తుంది.రిప్లై ఇవ్వు కృష్ణ.."
@7:14రా
"కృష్ణ..నేను మారతాను..తొందరపడి ఏ పిచ్చి పనీ చెయ్యకు.:(("
@7:27రా
"కృష్ణ.ఎక్కడని వెతకను నీకోసం.ఎంజిబియస్ లో ఉన్నాను.ఇక్కడ నువ్వు ఉంటే.ఫోను చెయ్యి.ప్లీజ్."
@8:28రా
"సికింద్రబాద్ స్టేషన్లో ఏటియంలొ డబ్బులు డ్రా చేసావా.అక్కడ ఏం చేస్తున్నావు కృష్ణ."
@8:34రా
"కృష్ణ దయచేసి ఫొన్ చెయ్యి ఇంత పెద్ద శిక్ష వెయ్యకు..నేను స్టేషన్ కి బయల్దేరుతున్నాను..అక్కడే ఉండు ఎక్కడికీ వెళ్ళొద్దు.."
@8:42రా
"కృష్ణ ఫోన్ ఎత్తు..ఎక్కడ నువ్వు స్టేషనంతా వెతుకుతున్నాను.."
@9:15సా
"నాకు కోపం వస్తుంది.."
@9:27రా
"కృష్ణ నువ్వు xxx ట్రైన్ కి బయల్దేరావా..ఈ టైంకి మీ ఊరికి అదేగా ఉంది. సిటీ దాటకముందే ఎక్కడన్నా దిగిపో కృష్ణ నేను వస్తాను..ఇంక నిన్ను చుడకుండా క్షణం కూడా ఉండలేను..ఫోన్ చెయ్యి కృష్ణ .."
@9:45రా
"కృష్ణ .ప్రియమైన వారి మౌనం ఇంత బాధగా ఉంటుందని నాకు తెలీదు.నన్ను క్షమించు."
@11:02రా
కళ్ళల్లో నీళ్ళు..నా మనసుని..తనువుని కడిగేస్తున్నాయి..
తనకి ఫొన్ చేసా..
"పలుకుల నీ పేరె పలుకుతున్నా..
పెదవుల అంచుల్లో నిలుపుకున్నా..
మౌనముతో నీ మదిని బంధించా..
మన్నించు ప్రియా..."
తన రింగ్ టోన్ ఆ నిశ్శబ్ద వాతావరణంలో మలయమారుతంలా నా చెవిని తాకుతుంది..
ఎదురుగా తాను..
గుండెల్లో గువ్వలాగ నేను..
కన్నీటితో ఇద్దరి గుండెలు తడిచిపోతుంటే..
"సారీ రాధా.."అన్నాను.
"ఈ బాధ మంచిది అవసరం.."అన్నాడు నవ్వుతూ.
నేను తనకి చాలాసార్లు చూపించిన బాపూ'రమణీ'య 'పెళ్ళిపుస్తకం' లోలాగా.
You know what.. this is simply superb. Yentha baagaa raasaarante nenu poorthigaa leenamaipoyi screen lo moham pettesi maree chadivesaanu!!
రిప్లయితొలగించండి@Priya:Thank You soo much priya..:)
తొలగించండిChala Bagundi Dhathri Garu!!
రిప్లయితొలగించండి@అజ్ఞాత:Thank You..:)
తొలగించండి"ఈ బాధ మంచిది అవసరం.." Bapu-Ramana cinema anandi Dhathri garu :(
రిప్లయితొలగించండి@అజ్ఞాత:క్షమించండి.నిజమే.:((
తొలగించండిసరి చేసాను.
chaala bagundi indu..
రిప్లయితొలగించండి@Ramani Challa:Thank You
తొలగించండిchalaa sensitive gaa rasaaru kadhani.baagundi.
రిప్లయితొలగించండిdhanyavaadaalu..:)
తొలగించండిtoo good indu...
రిప్లయితొలగించండిtoo good indu....:)
రిప్లయితొలగించండిThank You Veena..:)
తొలగించండి:) very nice.
రిప్లయితొలగించండి@తృష్ణ:ధన్యవాదాలు తృష్ణ గారు..:)
రిప్లయితొలగించండిidi kooda too goood ... ee speed tho intha baaga ela rastnarandi...Tips please :)
రిప్లయితొలగించండి@3lok:అంత సీన్ ఎమీ లేదండీ బాబోయ్.పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు..:)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండి:)..
తొలగించండిheart toching story
రిప్లయితొలగించండికళ్ళల్లో నీళ్ళు తెప్పించారు ..
రిప్లయితొలగించండిస్పందనకు ధన్యవాదాలు.. :)
తొలగించండి