11 నవం, 2012

నీటి అద్దం
ఎవరో అన్నారు..

మనసు అద్దమట..
అంతరాత్మ ప్రతిబింబమట..
పగిలితే అతకదట..
నిజమే..
కానీ..ఇది ఒట్టి నీటి అద్దం..
అద్దమైతే..ముక్కలుగా పగిలినా..
ప్రతీ ముక్క సవ్యంగానో...అపసవ్యంగానో..
ప్రతిబింబిస్తుంది..
మరి ఇది నీటి అద్దం కదా..
చిన్న రాయి చాలు..
ఆలోచనల అలజడులనూ..
కల్లోల తరంగాలనూ..సృష్టిస్తుంది.
ఆ అలజడులూ..తరంగాలూ.. శాశ్వతమైతే..
అద్దమే కనుమరుగవుతుంది..
ఆ కనుమరుగయిన అద్దాల ఆవేదనంతా..
ఒకే మాటలో..
"నా మనసు చచ్చిపోయింది.."
అంటే మరణమే కదా..
జాగ్రత్త నేస్తం..
ఇది..మనసు..
ఒట్టి నీటి అద్దం..

3 వ్యాఖ్యలు:

 1. ప్రత్యుత్తరాలు
  1. @Priya:అవి కవితలు కాదు ప్రియా గారూ..
   తవికలు..
   నా మనసులో భావలను నాకు వచ్చిన భాషలో వ్యక్తపరిచాను అంతే..:))
   ధన్యవాదాలు..:)

   తొలగించు
 2. ధాత్రి గారు మీ మనసులో ని బావాలను ఉపమానాలతో వర్ణించడం చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))