19 నవం, 2012

పూల అవ్వ   
ఈ అవ్వని చూసారా??
ఈవిడే నా పూల అవ్వ.
ఎక్కడినించి తీసుకొస్తుందో కానీ అదిగో ఆ బుట్టలో ఉన్న కాసిని పూలే తీసుకొచ్చి అమ్ముతుంది.
"ఎంత అవ్వ?" అన్నామనుకోండి,
"పావుకిలో ఇరవై రూపాయిలమ్మ" అంటుంది.
ఒక పొలిథేన్ కవర్ నిండా పువ్వులేసి ఇరవైరూపాలివ్వమ్మ అంటుంది.
అవి అరకిలో పైనే ఉంటాయి కానీ పాపం అవ్వదగ్గర తూకం వెసే సామగ్రి ఎమీ ఉండదు.
కొంత మంది పొదుపర్లు అవి అరకిలో ఉంటాయని తెలిసినా బేరమాడి మరీ తీసుకుంటారు.
అవ్వకి చిల్లర ఇవ్వడానికి కూడా కళ్ళు సరిగా కనపడవు.చాలామంది చిల్లు నోట్లు ఆవిడకి అంటగట్టి పోతారు.
పాపం అవ్వకి ఎవరూ లేరంట ఒక రోజు నాతో చెప్పింది..
ఆ అవ్వ దగ్గర నేను దాదాపు రోజూ పూలు కొంటాను..ఆ పూలు ఇంట్లో వాడిపోయినా సరే.కనీసం ఆ అవ్వని చుడ్డనికైనా కొనాలనిపిస్తుంది నాకు.  .ఒక పది రూపాయిలు ఎక్కువిద్దామని పయత్నించామనుకోండీ ఇంకాసిని  పువ్వులు వెసేస్తుంది అవ్వ.ఊరికే తీసుకోవడం ఇష్టముండదేమో అవ్వకు అందుకే ప్రసాదం అని అబద్దం చెప్పి అప్పుడప్పుడు అరటి పళ్ళు ఇచ్చెస్తా అవ్వకు..(అది మంచి పనో కాదో నాకు తెలేదు.).
దూరం నించి అవ్వని ఫొటో తీయడానికి ప్రయత్నించా..
కానీ కుదర్లేదు..దగ్గరకెళ్ళి అవ్వని అడిగి తీసేసరికి చాలా ఆనందపడిపోయింది.. 
కాళ్ళు..చేతులు సక్రమంగా ఉండి,వయసులో ఉండి కూడా చాలా మంది  యాచక వృత్తిని ఆశ్రయిస్తున్నారు. 
ఎంతో కష్టపడుతూ తన అత్మాభిమానాన్ని కాపాడుకుంటున్న ఈ అవ్వ నాకు చాలా చాలా ఇష్టం.  
ఇరవై రూపాయలకు నాకు ఎన్ని పూలు ఇచ్చిందో చూశారా ..

22 వ్యాఖ్యలు:

 1. ila leni vallaki sahayam cheyadam lo thappu ledhu Indu,u r doing a goodthing..

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆ అవ్వకి ఊరికే ఎమీ తీసుకోవడం ఇష్టం ఉండదు కదా అందుకే తప్పో ఒప్పో తెలీదు అన్నానండి.
   ధన్యవాదాలు

   తొలగించు
 2. bagundandi.me bloglo paata kooda bagundi.e movie lo idi?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రత్యుత్తరాలు
  1. @Chinni:చిన్ని గారూ నా బ్లాగ్ కి స్వాగతమండి.
   వ్యాఖ్య కి ధన్యవాదాలు..:)

   తొలగించు
 4. "కాళ్ళు..చేతులు సక్రమంగా ఉండి,వయసులో ఉండి కూడా చాలా మంది యాచక వృత్తిని ఆశ్రయిస్తున్నారు. "
  ఇది నిజమండి..! బావుంది పోస్ట్ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @తృష్ణ:అవునండి.:(..మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ పూల అవ్వని మాకు పరిచయం చేసినందుకు థాంక్స్.. మాక్కూడా ఆవిడ, ఆవిడ తెచ్చిచ్చే పువ్వులూ నచ్చేసాయని చెప్పండి.. :)

  ప్రత్యుత్తరంతొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))