??????

20 నవం, 2012

తులసీ ద(వ)ళం

టైటిల్ చూసి ఇదేదో ఆధ్యాత్మిక విషమనుకొనేరు.కాదండి బాబోయ్..:)
ఇది నా తులసి కోట కథ


ఇదే నా బుజ్జి తులసి కోట.
పెళ్ళై కొత్త ఇల్లు పెట్టుకొన్న ఏడు నెలలకు పెట్టుకోగలిగాను.
అన్ని నెలలు ఎందుకంటా?అంటారా..చెప్తున్నా చెప్తున్నా.
నాకు కృష్ణ తులసిని ధవళ వర్ణ కోటలో పెట్టుకోవాలని కోరిక.అందులోనూ చలువరాతిది మరీ ఇష్టం
దాని కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసా. కానీ  భాగ్యనగరంలో ఎక్కడా దొరకలేదు.శిల్పారామంలో కూడా పెద్దవి ఉన్నాయి కానీ నా చిన్ని ఇంట్లో గట్టు మీద ఇమిడిపోయె పరిమాణంలో మాత్రం లేవు.ఇలా వెతుకుతూ ఉండగానే కార్తీకమాసం వచ్చేసింది.
ఇక ఎదో ఒకటి పెట్టెయ్యాలి అని,మొన్న దీపావళికి దీపాలు కొనడానికి శిల్పారామం వెళ్ళినప్పుడు మొత్తం షాపులన్నీ తిరిగేసా.ఎక్కడా దొరకట్లేదు పింగాణివి, మట్టివి ఉన్నాయి ,బాగున్నాయి .కానీ అవి తెల్లగా లెవే..:( 
ఇక ఏంచేస్తం అని ఒక బుజ్జి మట్టి తులసి కోట తీసెసుకున్నా.ఇలా తీసుకొని అలా శ్రీవారికి డబ్బులు ఇమ్మని చెప్పి,వెనక్కి తిరిగానో లేదో కనపడింది ఎదురు షాపులో తెల్లగా బుజ్జిగా ఉన్న ఈ తులసి కోట.అది కూడా ఒకే ఒక్కటి ఉంది.వదులుతానా??
ఇంక మొదలు పెట్టా  "నాకు ఇది వద్దు .అదే కావాలి.మీరు ఏంచేస్తారో నాకు తెలేదు.అందుకే షాపులన్ని తిరిగి కానీ కొనొద్దు అన్నాను.మీరే కంగారు పెట్టారు" అని..
పాపం మా సారు ,ముందు కొన్నవాడి కాళ్ళా వేళ్ళా పట్టుకొని అ మట్టి తులసి కోట వెనక్కి ఇచ్చేసి ఇది తీసేసుకున్నారు.
తెచ్చేసా కృష్ణ తులసి వెసేసా(కృష్ణ తులసి కూడా ఒకేఒక్కటి మొలిచింది అమ్మ వేసిన విత్తనాల్లో.:)..).
చలువరాతిది కాకపోయినా ,తెల్లగా బాగుంది కదా.:)
 అంతేం లేదు.దీనికింత కథ అవసరమా అంటారా..?:(


13 కామెంట్‌లు:

  1. indu thulasi kota bagundhi.inthaki phani ni nana thippalu petti konnavannamata :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @అజ్ఞాత:మీరెవరో నాకు తెలిసిన అజ్ఞాతలా ఉన్నరు.అందుకే కనిపెట్టేసారు..:)వ్యాఖ్యకు ధన్యవాదాలు..:).

      తొలగించండి
  2. బుల్లబ్బాయ్22 నవంబర్, 2012 10:25 AMకి


    --> నాకు కృష్ణ తులసిని దవళ వర్ణ కోటలో పెట్టుకోవాలని కోరిక.

    దవళ కాదు.. "ధ"వళ

    రిప్లయితొలగించండి
  3. @బుల్లబ్బాయ్:మరింకేం తెచ్చేసుకోండి.ధవళం సరి చేసానండి.వ్యాఖ్యకి ధన్యవాదాలు బుల్లబ్బాయ్ గారు..:)

    రిప్లయితొలగించండి
  4. భలే ముద్దుగా ఉందండీ మీ చిట్టి తులసి కోట.. :)

    రిప్లయితొలగించండి
  5. hai dhatri,
    anta lekapovatamem ledu.konni bujji korikalu teerina anandam,adi anubhavinchina vallake telustundi.naku matram shilparamamlo rangu rangula matti tulasikota ishtam.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Hello Sindhu..
      అవును కదాండి..హమ్మయ్య..నా ఆనందం మీకు అర్ధమైయ్యింది..
      అవును రంగురంగుల మట్టివి కూడా బాగుంటాయి...:)

      తొలగించండి
  6. oh datri really very cute. mana chinna chinna anandalu inta andam ga andarito panchukovadam gr8 idea. naku chala chala nachesav....and ne blog kda.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ నచ్చి నన్ను కూడా మెచ్చినందుకు మీకు ధన్యవాదాలండి..:)

      తొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))