??????

12 నవం, 2012

మిత్రులకు దీపావళి శుభాకంక్షలు..:)

మా ఆఫీసులో.. దీపాల రంగవల్లి..
వెలుగులు..జిలుగులు..
దివ్వెలు..మువ్వలు..
నవ్వులు..పువ్వులతో..
ఈ దీపావళి..మీ మనసులలో..
ఉత్సాహాన్నీ..సంతోషాలనూ..
నింపపాలని కోరుకుంటూ..
ధాత్రి..





















































11 నవం, 2012

నీటి అద్దం




ఎవరో అన్నారు..

మనసు అద్దమట..
అంతరాత్మ ప్రతిబింబమట..
పగిలితే అతకదట..
నిజమే..
కానీ..ఇది ఒట్టి నీటి అద్దం..
అద్దమైతే..ముక్కలుగా పగిలినా..
ప్రతీ ముక్క సవ్యంగానో...అపసవ్యంగానో..
ప్రతిబింబిస్తుంది..
మరి ఇది నీటి అద్దం కదా..
చిన్న రాయి చాలు..
ఆలోచనల అలజడులనూ..
కల్లోల తరంగాలనూ..సృష్టిస్తుంది.
ఆ అలజడులూ..తరంగాలూ.. శాశ్వతమైతే..
అద్దమే కనుమరుగవుతుంది..
ఆ కనుమరుగయిన అద్దాల ఆవేదనంతా..
ఒకే మాటలో..
"నా మనసు చచ్చిపోయింది.."
అంటే మరణమే కదా..
జాగ్రత్త నేస్తం..
ఇది..మనసు..
ఒట్టి నీటి అద్దం..

7 నవం, 2012

చివరి మజిలీ....




ఇది చదివాక మనసులో వేల వేల భావలు..అలజడులు...మహోన్నతమైన  Dr.సుబ్రహ్మణ్యం  గారి ఆలోచనలనీ..,ఆచరణ పెట్టిన విధానాన్నీ..,వారికి సహయ సహకారాలు అందిస్తున్న మహానుభావులనీ ..,ఎంత పొగిడినా  తక్కువేమో!..ఇంత గొప్ప పని చేయడానికి ఎంత దృఢ సంకల్పం కావాలో అనిపించింది..   వ్యక్తపరచలేని ఎన్నో ఆలోచనలతో మనసు  ఊగిసలాడుతుంది ..అందులోని ఒక ఆలోచనే మీతో  ఈ article పంచుకోవాలనిపించింది..ఈనాడు ఆదివారం లో 'ఈ వారం ప్రత్యేకం.."

ఈ article ఇక్కడ చదవండి..
http://www.eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1x

లేదా ఇక్కడ కూడా చదవచ్చు..
https://docs.google.com/open?id=0B19jiOSXOfvGSURKYl9pWlNNdDA


























6 నవం, 2012

లక్ష్మి ..సాగరిక….









ఓసారి  ఏమైందంటే..

ఆ రోజు నాగుల చవితి అన్నమాట..పొద్దున్నే అమ్మ,నాన్న,నేను,చెల్లి స్నానాలు చెసేసి, మా వీధి  చివర ఉండే నాగుల పుట్టకి వెళ్ళిపోయి,పూజ చెసేసి,పుట్టలొ పాలు పోసేసి, ఆనక మా పొట్టలో కూడా పొసేసుకొని ఇంటికి వచ్చి టీవీలో నోము సినిమా చుస్తుంటే(ప్రతీ నాగుల చవితికీ ఈటీవీలో వస్తుంది...:) )..పక్కింటి ఆంటీ గుడికి వెళ్తూ ,అమ్మని ఎదో అడగడానికి వచ్చారు.  

ఆవిడ చక్కగా ఒక బుట్టలో తేగలు,చిమ్మిలి,తాటి బుర్రలు అన్నీ సర్దుకొని ,అరుగు మీద పెట్టారు. ."పొరిగింటి పుల్లకూర రుచి"  అని అమ్మ ఎన్ని చేసిన మేము తినకుండా ఆ ఆంటి అమ్మతో మాట్లాడి బయటకు వచ్చే లోపల మేము బుట్ట మీద పడి మొత్తం ఖాళీ  చేసేసాం .:/ ..ఆవిడ బయటకి వచ్చి ఖాళీ బుట్ట చూసుకొని..అమ్మని చూసి..ఏడవలేక నవ్వుతూ వెళ్ళిపోయింది పాపం.:D..అంతే అమ్మ మమ్మల్ని ఒక చూపు చూసింది..మాకు గుండెల్లో బస్సులు, రైళ్ళు అన్నీ పరిగెత్తాయి..భయంతో నేనూ చెల్లీ ఒక మూల కి వెళ్ళి కుర్చొని సాయంత్రం దాక కదలలేదు..అమ్మ కూడా ఏం మాట్లడలేదు..  :(


ఇంక సాయంత్రం అమ్మ ఇద్దరికీ స్నానాలు చేయించి...అన్నం పెట్టింది..అప్పుడు పాపం  అమ్మకి మా మీద జాలి వేసిందెమో..కూర్చోబెట్టుకొని కధ చెప్పటం మొదలు పెట్టింది.. 


"ఒక ఊరిలో లక్ష్మి,సాగరిక అనే మంచి పిల్లలు ఉండేవాళ్ళు అంట..వాళ్ళ ఇంటి పక్కనే రమ్య ,సౌమ్య అనే పిల్లలు కూడా ఉండేవాళ్ళు అంట..ఒక సారి లక్ష్మి,సాగరిక వాళ్ళ ఇంటికి ఒక ఆంటి గుడికి వెళ్తూ ప్రసాదం బుట్ట పట్టుకొచ్చింది  అంట..అప్పుడు లక్ష్మి, సాగరిక వాళ్ళు ఆ ప్రసాదం జాగ్రత్తగా ఈగ కూడా వాలకుండా చూసి,వాళ్ళ ఇంట్లో ఉన్న పువ్వులు కూడా కోసి ,ఆ  ప్రసాదం బుట్టలో పెట్టి  ఆంటి వెళ్ళేటప్పుడు ఆవిడకి  ఇచ్చేసారంట ..ఆ ఆంటి చాల సంతోషపడి వెళ్ళిందంట. ఆ ఆంటి పక్కనే ఉన్న రమ్య సౌమ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిందంట..వాళ్ళు ప్రసాదం మొత్తం ఖాళీ చెసేసారంట.(సీన్ అర్ధమైందా??;);))అప్పుడు ఆ ఆంటి ఏమి అనలేదు కానీ, ఊర్లో అందరికీ లక్ష్మి ,సాగరిక మంచివాళ్ళు..రమ్య ,సౌమ్య మంచివాళ్ళు కాదు అని చెప్పిందంట.."నా ప్రసాదం మీరు తినేస్తారా.. x-( అని దేవుడికి కూడా రమ్య సౌమ్య మీద కొపం వచ్చిందంట..దెవుడు వాళ్ళని శపించాడంట ..అప్పుడు వాళ్ళు క్లాస్లో లాస్ట్ వచ్చారంట...లక్ష్మి సాగరిక మాత్రం క్లాస్లో ఫస్ట్ వచ్చారంట.  .."


ఇది విన్న వెంటనే మాకు అర్దమైపోయింది ఆ రమ్య, సౌమ్య మేమేనని అంతే వెంటనే  అమ్మని పట్టుకొని ఏడవడం  మొదలు పెట్టాము " అమ్మ నిజంగానే దేవుడికి కోపం వచ్చిందా??నిజంగానే మేము ఫెయిల్ అయిపోతామా??..:(" అని అప్పుడు అమ్మ చెప్పింది ఆ ఆంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్తే దేవుడికి కోపం పోతుంది అని..వెంటనే మేము పరిగెత్తుకి వెళ్ళి ఆ ఆంటికి సారీ చెప్పి వచ్చాము.. 

ఇది మొదలు మేము ఏ చెడ్డ పని చేసినా లక్ష్మి,సాగరిక ,రమ్య,సౌమ్య..తెర మీదకి వచ్చేవాళ్ళు :D ..వెంటనే తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవటం..లక్ష్మి ,సాగరికల్లాగ అవ్వాలని రాత్రి పగలు కలలు కనేవాళ్ళం..నేను చెల్లి ఒకరికి ఒకరు..ఏం తప్పు చేసినా .."లక్ష్మి..సాగరిక ఇలా చెయ్యరు..రమ్య..సౌమ్య లాగ చేస్తున్నావ్".. అనుకొనేవాళ్ళం..క్రమంగా అమ్మ కధల్లో కూడా రమ్య సౌమ్యలు మాలాగ మoచిపనులు చేస్తు లక్ష్మి సాగరికల్లాగా  మారిపొసాగారు..మేము 7th  క్లాస్ కి వచ్చేసరికి లక్ష్మి,సాగరిక ,రమ్య,సౌమ్య అందరూ మంచి పిల్లలైపోయరు.. :D


కానీ అమ్మ చెప్పిన ఆ కధలన్నీ కాశీ మజిలి కధల్లాగా ఒక బుక్  వెయ్యొచ్చు..ఇప్పటికి ఏమన్నా చెడ్డ పని  చేస్తే ఎదో ఒక కధ గుర్తొస్తుంది..అమ్మ ఆ పాత్రలకి పెట్తిన పేర్లు..వాటి ప్రవర్తన అంతా ఎంత బాగుండేదో..సాగరిక (సాగరం నించి పుట్టినది అంటే లక్ష్మి దేవి అన్నమాట)  పేరు అంటే నాకు మరీ ఇష్టం..:)

ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశం మీద మనకు ఇంటర్నెట్,  టీవీ ,పేపర్లలో బోలెడంత సమాచారం గైడెన్స్   దొరుకుతుంది..కానీ ఇవేమీ లేని ఆ రోజుల్లోనే అమ్మ ఎంచుకున్న విధానం ఇప్పటికీ మమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది..ఎవరితోనూ మమ్మల్ని పోల్చలేదు..ఎక్కువగా ఎప్పుడూ తిట్టలేదు..తన క్రియేటివిటితో,సహనంతో  రమ్య ,సౌమ్య ల్లాంటి తన పిల్లల్ని లక్ష్మి సాగరిక ల్లాగ మార్చుకుంది....:)

తల్లితంద్రులు పిల్లలికి ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు   ..జీవితవు విలువలు నేర్పాలి..అసలు విలువలే తెలీకుండా  కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతోమంది బ్రతుకుతున్నారు..కానీ నిజమైన తృప్తి ఎంతమందికి ఉంటుంది..  


నేను ఎంతవరకూ నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ  అలాంటి విలువలు నేర్పిన అమ్మ నాన్నలకి  కృతజ్ఞతలతో....



5 నవం, 2012

మదీయ ద్విచక్ర వాహనంబు..



"దెబ్బలు తగలకుండా  ఎవరూ  సైకిల్  నేర్చుకోలేరు"

 ఇది అందరూ సాధరణంగా చెప్పే మాట .కానీ నేను నాతో పాటూ  మా అన్నయ్యలందరికీ దెబ్బలు తగిలించి మరీ సైకిల్ నేర్చుకున్నాను...:D .ఎలా అంటే..

నేను  చిన్న స్కూల్ నించి పెద్ద స్కూల్ కి వెళ్ళేటప్పుడు నాన్నగారు నాకో మాట ఇచ్చారు. ఏమిటంటే  నేను కనక 5th క్లాస్ పరీక్షలు పాస్ అయ్యి 6th క్లాస్ కోసం హై స్కూల్ లో సీట్  సంపాదిస్తే, నాకు సైకిల్  కొనిపెడతానన్నారు."దాని మీద రోజు చెల్లి నువ్వు స్కూల్ కి వెళ్ళొచ్చు"  అన్నారు (నేను, చెల్లి ఒకటే  క్లాస్ చిన్నప్పటినించీ. బాబోయ్ నేనేమి ఫెయిల్ అవ్వలేదు అండీ ..నాకు 5 సంవత్సరలప్పుడు  దానికి 4 సంవత్సరాలు. అప్పుడు ఇద్దరినీ ఒకేసారి స్కూల్లో  వేసేసారు..అదన్నమాట సంగతి...:)).సరే నేను పాస్ అవుతానని నామీద నాకు చాల  నమ్మకం ఉండబట్టి..వేసవి సెలవల్లో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నలుగురు అన్నయ్యలనీ  చాలా బ్రతిమలాడా నాకు సైకిల్ నేర్పమని..


సరే ఎలగైతేనేమి ఒక అన్నయ్య ఒప్పుకున్నాడు.వాడు ఒక పేద్ద సైకిల్  తీసుకొచ్చి,  ఒక రెండు రోజులు నన్ను రోడ్   మీద తిప్పాడు.రోడ్  మీద ఎలా నడపాలి ,ఎటు వైపు నడపాలి ఇలాంటి థియరి అంతా చెప్పిన మీదట,ఇప్పుడు ప్రాక్టికల్స్  టైం అన్నాడు.ముందుగా  నన్ను ముందు కుర్చోబెట్టుకొని,హాండిల్   పట్టుకోమనేవాడు.వాడు కూడా పట్టుకొనేవాడు..అలా.. అలా.. ఒకసారి  తను తొక్కుతూ నాకు తెలీకుండా హాండిల్  వదిలేసాడు.నేనూ బాగానే పట్టూకున్నా.స్ట్రైట్  రోడ్  అవ్వటం వలన హాండిల్  తిప్పాల్సిన పని లేకుండా ఒక 5 నిమిషాలు బాగానే పట్టుకున్నా.కానీ, ఎందుకో అన్నయ్య వైపు చూసా అన్నయ్య చేతులు ఖాళిగా ఉన్నాయి.అంతే హాండిల్    ొదిలేసా.ఇంకేముంది ఇద్దరం రోడ్ పక్కన ఉన్న బురదలో జర్రుమని పడ్డాం.



నాకేమీ దెబ్బలు తగలలేదు కానీ,పాపం అన్నయ్యకి దెబ్బలు తగిలాయి.అయినా మొదటి సారి కదా నన్ను క్షమించేసాడు అన్నయ్య.మళ్ళీ మరుసటి రోజు సైకిల్ మీద తీసుకెళ్ళాడు.ఇలా ఒక వారం రోజులకి హాండిల్ పట్టుకోవడం నేర్చుకున్నా.కానీ, కాళ్ళు అందేవి కాదు సో, తొక్కడం అన్నయ్య చూసుకొనేవాడు..ఇలా రోజులు గడుస్తుండగా...


ఒకరోజు యధావిధిగా  నేను హాండిల్ పట్టుకుంటే అన్నయ్య వెనకాల పాటలు   పాడుకుంటూతొక్కుతున్నాడు.కాసేపటికి ఎదో స్మెల్ వచ్చింది.చూసా.అన్నయ్య సిగరెట్  కాలుస్తున్నాడు..నేను అలానే కాం గా ఉండి  ఇంటికి వెళ్ళి డిటెక్టివ్ రేంజ్లో  పెద్దమ్మ తో మెల్లగా చెప్పేసా..అంతే వాడికి ఫుల్ కోటింగ్ పడిపోయింది..ఇంక వాడు

"రాక్షసి .. దొంగ మొహమా..నమ్మక ద్రోహి..విశ్వాస ఘాతుకురాలా.."అని నానారకాలుగా తిట్టి, "నీకు సైకిల్ చచ్చినా రాదు" అని  శాపనార్దాలు పెట్టి , తర్వాత నేను ఎంత బ్రతిమలాడినా నాకు సైకిల్ నేర్పలేదు.


సరే సెలవలు అయిపొయాయి.మా ఊరికి మతో పాటూ ఇంకో అన్నయ్య కూడా వచ్చాడు .వచ్చేసరికి నాన్నగారు కొత్త సైకిల్ కొని ఉంచారు.ఆ అనందం తో ఒక రోజు గడిచిపోయింది.రెండో రోజు ఎలాగోలా మెల్లగా మా ఇంకో అన్నయ్యని బ్రతిమలాడా.కొత్త సైకిల్  కదా సరదాగా ఉంటుందని వాడూ  ఒప్పుకున్నాడు.. వాడి దయవల్లా...సైకిల్ చిన్నది అవ్వటం వల్లా.. ఎక్కడం, తొక్కడం కూడా  నేర్చేసుకున్నా...


ఒక రోజు మా అన్నయ్య నేను తొక్కడం చూసి తన శిష్యురాలి ప్రగతిని చూసి మురిసిపోయి ,నన్ను సైకిల్ ఎక్కించి "తొక్కుకుంటూ ఇంటికి వెళ్ళిపో..నేను వెనకాలే వస్తా"  అన్నాడు..సరే అని మొదటి సారి ఎవరి సహాయ సహకారాలు లేకుండా సైకిల్ తొక్కుతున్నాననే ఆనందంలో ఉండగానే ఇల్లు వచ్చెసింది..అమ్మ బయట బావి దగ్గర ఉంది..నా ప్రజ్ఞ్నాపాటవాలు  చూసి మెచ్చుకోలుగ నవ్వుతుంది..అప్పుడు నాకు గుర్తొచ్చింది..ఎమిటంటే..నాకు సైకిల్ బ్రేక్ వేసి దిగడం రాదని.. :O


అంతే..ఇల్లు వచ్చేసింది..నేను దాటెసాను..తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాను..అమ్మ దిగు దిగు అని అరుస్తుంది..నేను అలానే అమ్మని చూస్తూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న్నా..వెళ్ళిపొయా..

తర్వాత అన్నయ్య వచ్చాడు."పిన్నీ అది ఇంకా ఇంటికి రాలేదా" అని అడిగాడు.అమ్మ లబోదిబోమంటూ జరిగింది అంతా చెప్పింది. అంతే అన్నయ్య బండి వేసుకొని బయల్దేరాడు.అప్పుడు నేను మా ఊరు పేరుపాలెం దాటేసి పక్క ఊరు ముత్యాలపల్లి కూడా వెళ్ళిపోయాను.అప్పుడు అన్నయ్య నన్ను ఛేజ్ చేసి పట్టుకొని  ఆపాడు.ఇద్దరం మళ్ళీ కింద  పడ్డాం...:((


ఆ దెబ్బలు మానిపోతుండగా నేను ఎక్కడం, తొక్కడం, దిగడం అన్నీ నేర్చేసుకున్నా ..

ఇప్పుడు ఎవరూ లేకుండ కొంచెం దూరం(మా వీధి చివర కొట్టు వరకూ)సైకిల్ వేసుకొని వెళ్ళి అమ్మ చెప్పిన సరుకులు  తెస్తూ ఉండేదాన్ని.  .
ఇలా ఉండగా ఒకరోజు రోడ్ మీద ఎవరో ఇద్దరు మిత్రులు పాపం ఆప్యాయంగా వారి ద్విచక్ర వాహనాలపై(సైకిల్)  కూర్చొని..ఒకరి భుజం మీద ఒకరు చెతులేసుకొని మాట్లాడుకుంటుండగా..నేను దూరం నించి వారిని తిలకించాను..అప్పుడు నా మనసులో ఒక ఆలొచన వచ్చింది..."కొంప తీసి నేను వాళ్ళ మధ్యనించి వెళ్ళను కదా అని..వెంటనే మళ్ళీ  అనుకున్నా ఛ అలా ఎందుకు చేస్తా..నేను ఇప్పుడు నా ద్విచక్ర రధ సారధ్యం లో  ఆరి తేరి ఉన్నా కదా"  అని...కాని విధి బలీయమైనది కదా ..

వెళ్తున్నా వెళ్తున్నా..వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా..ఏమైందో తెలీదు..హాండిల్ వాళ్ళ వైపుకి తిరిగింది..అంతే నేను వాళ్ళ మధ్య నించి కొంప తీయకుండానే దూసుకుపోయాను.ఆ మిత్రులు వాళ్ళ వాహనాలతో సహా పడిపోయారు.ఏం జరిగిందో వాళ్ళకి అర్ధం  కాలేదు.నాకు అర్ధమైంది ..ఎందుకంటే అలవాటు అయిపొయాయి...:) .వాళ్ళకి అర్ధం అయ్యాక   మెల్లగా లేచారు..నన్ను  అదోలా చూసి నన్నూ  లేపారు..నేను సిగ్గుతో ఇంటికి పారిపోయాను..ఏం జరిగింది అని అమ్మ అడుగుతున్నా.ఏం చెప్పకుండా .లొపలికి పారిపోయా..తర్వాత పాపం వాళ్ళు నా వాహనాన్ని మా ఇంటికి తెచ్చి ఇచ్చారనుకోండి..పాపం ఏమి అనలేదు వాళ్ళు కూడా...:))


 ఇదండి నా సైకిల్ కధ..తర్వాత చెల్లిని వెనకాల ఎక్కించుకొని వీర తొక్కుడు తొక్కెసాననుకోండి..బ్రేక్స్ లేని సైకిల్ తో కూడా సేఫ్ గా ఇంటికి వచ్చేదాన్ని..



కాలేజ్లో  ఉండగా స్కూటీ  కూడ నేర్చేసుకున్నా మా ఫ్రెండ్ని పడేసి మరీ..:P

17 సెప్టెం, 2012

ఆనందమే.. ఆనందమే..


మిత్రులకు హాయ్,

చాలా రోజుల తర్వాత,  ఈ శనివారం ఆనంద్ సినిమా చూసాను..
నిజంగా మనసు ఆనందమయిపోయింది ...

చాలా సున్నితమయిన భావాల్ని చాలా అందంగా చూపించారు  శేఖర్ కమ్ముల గారు ..
పొద్దున్నే వినిపించే శాస్త్రీయ సంగీతం నేపధ్యంలో  ఒక మంచి కాఫీ.
సూటిగా ఉండే మనుషుల మధ్య ఉండే  సున్నితమయిన స్నేహం..
ప్రకృతి అందాలు...సంక్రాంతి పండుగలు...గల్లిల్లో గొడవలు...వాన పాటలు...
ముఖ్యంగా  హాయి గొలిపే సంగీతం...దానికి తగ్గ వేటూరి  గారి సాహిత్యం...





అందులో  ఒక సందర్భంలో  ఈ పాట  ..కధానాయిక  గురించి కధానాయకుడు   మనసులో  పాడుకొనే  పాట.. 
"గుండెకే   గాయం చేసి  నిండుగా  నవ్వేస్తుంది.. 
పాపలా ముద్దొస్తుంది..పడుచులా  కవ్విస్తుంది.."

భాధని..ప్రేమనీ..కలగలుపుకున్న పాట  
మనసుకి హత్తుకుంటుంది..కళ్ళళ్ళో  నీళ్ళు తెప్పిస్తుంది..    

ఇంకో  సందర్భంలో  వేటూరి  గారి  ఛమత్కారం..   
"గస గసాల కౌగిలింత మెరిసి మాయమవుతావు   ..." అని
అప్పుడు  అస్సలు అర్ధం  కాలేదు  ..తర్వాత  వేటూరి  గారు   ఎక్కడో  చెప్తుంటే   విన్నా.. 
అదీ..
"సగ సగాల కౌగిలింత" అంట..అంటే  విరహాన్నీ.. ఇంగ్లీష్లో  అంటారు  చుడండీ.. 
''Budding Chemistry(మొగ్గ తొడుగుతున్న ప్రణయం )' అని, దానిని అల చెప్పారన్నమాట..  
ఏం చెప్తాం చెప్పండి..  




ఇలాంటివి ఎన్నో.... 
అన్నీ..అన్నీ..
భలే ఉన్నాయి ..ఎన్ని సార్లు  చూసినా  మళ్ళీ మళ్ళీ  చూడాలనిపించే  సినిమా..
ఒక ఆడపిల్ల అత్మాభిమానాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసారు..

నాకు కవిత్వం రాదు కానీ .. ఎక్కడో ..ఆనంద్ సినిమా గురించి చదివాను.. 

"గోరింటాకు సరిగ్గా పండకపోతే  వచ్చే బాధ..
నిద్రపోతున్నపసిపాప  దగ్గర  ఉండే  నిశ్శబ్ధం ... 
రాత్రంతా  మేలుకున్నా మొగ్గ ఎప్పుడు పువ్వు అవుతుందో  తెలియని మిస్టరీ..
ఆనంద్ సినిమా.."

ఎంత  అందమైయ వర్ణన  కదా... 
ఇంతకంటే  ఈ సినిమా గురించి బాగా చెప్పలేం అని నా 
ఫీలింగ్ ....
ఈ సినిమా..ఎప్పుడు చూసినా 
"మనసంతా ఆనందమవుతుంది..  
మనసున మల్లెల మాలలూగుతాయి.. "
శేఖర్ కమ్ముల గారికి పేద్ద ధాంక్స్ .. 

:):)