??????

6 ఆగ, 2013

శతదళ శోభల 'బ్రహ్మ కమలం'

ఎన్నళ్ళనించో ఎదురుచూస్తున్న అద్భుతం నిన్న నా చిన్ని తోటలో జరిగింది.
క్రిందటి వర్షాకాలం బ్రహ్మ కమలం గురించి విని, చదివి ఎప్పుడెప్పుడు మొక్క తెచ్చుకుందామా అనుకుంటుండగా ఒక నర్సరీలో మొక్క దొరికింది..
మూడు సంవత్సరాలకు కానీ పూయదు అని చెప్పారు నర్సరీ వాళ్ళు.
మొన్న జూన్లో ఆశ్చర్యంగా ఆరు మొగ్గలు తొడిగాయి.  
నేను ఆనందపడేలోపు ఆ మొగ్గలు ఒక్కొక్కటీ రాలిపోతూ వచ్చాయి..ఒక్క మొగ్గ మాత్రం పెద్దది అవుతూ వచ్చింది.  
ఇది కూడా ఎక్కడ రాలిపోతుందో అని దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను.
మొగ్గ నిన్న ఉదయానికి బాగా పెద్దది అయ్యింది..పూయడానికి ఇంకా వారం పడుతుందేమోలే అనుకున్నాను.
కానీ నిన్న నేను ఆఫీసునించి ఇంటికి వచ్చేసరికి
ఆశ్చర్యం..ఒక అద్భుత పరిమళం..
చుస్తే విచ్చుకున్న బ్రహ్మ కమలం
ఇక ఆనందానికి అవధులు లేవు..
ఆ పరిమళం ,ఆ రేకుల సౌకుమార్యం నిజంగా అద్భుతం..
కొండవీటి సత్యవతి గారు 'మా గోదావరీ' బ్లాగులో దీనిని వెన్నెల పుష్పం అంటే అతిసయోక్తి కాదనిపించింది..








19 కామెంట్‌లు:

  1. బావుందమ్మాయ్!చాలా కష్టపడిపెంచావు కదా!! ఫోటోలు బాగా తీశావు.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. నా బ్లాగుకు స్వాగతం కళ్యాణీగారు..ధన్యవాదాలు వ్యాఖ్యకు..:)

      తొలగించండి
  3. చాలా బాగుందండీ...
    నిజంగా వందకు పైగా రేకులుంటాయా ఈ కమలానికి, నేనూ ఈ ఆదివారం ఈ మొక్క గూర్చి ప్రయత్నిస్తాను.... just imagining ఇంత చక్కని బ్రహ్మ కమలం స్వామి మాదాలమధ్య ఒదిగితే ఎలాఉంటుందా అని...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేంద్ర గారు నా బ్లాగుకు స్వాగతం.
      తెల్లటి స్వఛ్ఛమైన రేకులు మూడు వరసలు..వాటి వెనుక తేనెరంగులో చిన్న రేకులు మూడు వరసలు.లెక్కకు మిక్కిలిగా ఉన్న పుప్పొడి రేణువులు..ఇవన్నీ కలిపి అలా అన్నానండి..నేను లెక్కపెట్టలేదు నిజానికి.
      ధన్యవాదాలు వ్యాఖ్యకు..:)

      తొలగించండి
  4. అలా వదిలారేమిటీ ? స్వామి పాదాలచెంతకు చేరితే దానిజీవితం,మనకష్టం సార్ధకమయ్యేవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దుర్గేశ్వర గారు
      స్వామి సర్వాంతర్యామి అనిపిస్తుందండి నాకు.ధన్యవాదాలు వ్యాఖ్యకు..:)

      తొలగించండి
  5. అబ్బ! ఎంత బావుందో ధాత్రి గారు. ఫొటోస్ పెట్టి మంచి పని చేశారు. చాలా బావున్నాయి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు ప్రియాగారు.
      ఆలస్యానికి మన్నించాలి..:)

      తొలగించండి
  6. అందంగా పెంచి ప్రెజంట్ చేసారు ఫోటోలని

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. ధన్యవదాలండి మీ వ్యాఖ్యకు..నా బ్లాగుకు స్వాగతం..:)

      తొలగించండి
  8. ధన్యవదాలండి మీ వ్యాఖ్యకు..నా బ్లాగుకు స్వాగతం..:)

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))