అవును నిజమండి.
అలాగిలా కాదు పీకల్లోతు ప్రేమలో
పెళ్ళైన భారతనారీపతివ్రతాసాధ్వీశిరోమణివనుకుంటుంటే ఈ ప్రేమేమిటో?నువ్వేదో మంచి పిల్లవనుకున్నామని దండకము మొదలు పెట్టేముందు ఒక్కసారి టపా పూర్తిగా చదవ మనవి.
నేను ప్రేమలో పడింది ఇదిగో దీనితో..
తెలుపు,గులాబీ,వంగపండు రంగులు రకరకాలుగా మేళవించి గుత్తు గుత్తులుగా పూసే ఈ పువ్వులు నా మనసు దోచేసుకున్నాయి.కాసియా జవానికా అంట ఈ మొక్క పేరు.ఈ మొక్క ఎలగయినా పట్టేయాలని గూగులమ్మను అడిగితే,అమేరికా వంటి దేశాలలో ఆన్లైన్లోనే దొరికేస్తున్నాయి కానీ ఇక్కడ దొరకడం లేదు..వరసగా ఇక్కడ ఉన్న నర్సరీలన్నింటికీ ఫోను చేస్తుంటే ఎన్ని మొక్కలు కావలి అంటారు..ఒక్కటంటే ఒక్కటేనండి అన్నామనుకోండి.."కడియం నించి తెప్పించాలండి..ఒక్కటైతే తెప్పించలేము" అని చెప్పేస్తున్నారు..:(
నేను ఊరుకుంటానా??వారాంతంలో దీని వెతుకులాటే నా పని.ఇంకా మా సారుకి చెప్పలేదు.చెప్తే,
"దేవీ
నీకేల ఈ పనికిమాలిన తపన
దేనికోసం ఈ సోధన.
నాకు తీరని వేదన.??"
అని లబోదిబోమంటారు.:D
చూశారా నన్ను అనవసరంగా అపార్ధం చేసుకున్నారు.
ఈ పాపం ఊరికే పోదు..మొక్క దొరకాలని నన్ను (నాకు తెలిసేలా..;)) ఆశీర్వదించి పాపానికి పరిహారం చేసుకుంటేనే,ఒక పూట నూనె వేపుడు(నరకంలో) తగ్గుతుంది:)
niku aa mookka dorakalani manasara korukuntuna..
రిప్లయితొలగించండికోరికకు ,వ్యాఖ్యకు ధన్యవాదాలు..:)
తొలగించండిపపడండి.అహహహ! ప్రేమలో పపడండి.ఒక మొక్క ఎలా పంపగలను?
రిప్లయితొలగించండిఎమిటీ మొక్కే నాకే పంపిస్తానంటున్నరా??
తొలగించండివ్యాఖ్యకు ధన్యవాదాలు శర్మగారు..:))
అహహహ! ప్రేమలో పపడండి.ఒక మొక్క ఎలా పంపగలను?
రిప్లయితొలగించండిబాగుందండి మీ ప్రేమ పురాణం, మొత్తానికి మొక్కకోసం ప్రేమలో పడ్డాను అంటారు, సరే, కాని చదివేవాల్లకి పాపం అంటగట్టెస్తార, ఇది తప్పు కదూ, మీరు కోరుకునే మొక్క దొరకాలని మనస్పూర్తిగా కోరుకుంటునాము.
రిప్లయితొలగించండిమనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారు కదా పాపం మీకు అంటదులెండి..వ్యాఖయకు ధన్యవాదాలు పార్వతి గారు..:)
తొలగించండిమొక్కపై ప్రేమను మాతో పంచుకున్నారంటే....భలే ఉధార్త గుణమండోయ్ మీది:-)
రిప్లయితొలగించండివ్యాఖ్యానించినందుకు మీదీ ఉదారగుణమేనండోయ్ ..:)
తొలగించండిaa plant doriki....pedha di ayyi...alanti photo meeru upload cheyalani manasputhiga korukuntunnanu...
రిప్లయితొలగించండిదొరికిన తర్వాతా..పూలు పూచాకా తప్పకుండా ఫోటోలు పెడతానండి.మీ ఆకాంక్షకి ధన్యవాదాలు..:)
తొలగించండిమొక్క మీకు దొరకాలి బాబోయ్! నా నూనె వేపుడు గురించి కాకపోయినా మీ శ్రీ వారి మీద జాలి తో కోరుకుంటున్నాను :-P
రిప్లయితొలగించండిAs usual, your style of writing is awesome :-)
-- Sirisha
hahaha..Thank You Soo Much..:))
తొలగించండిబాగా రాసారు !
రిప్లయితొలగించండిమీ మొక్క వోని దీక్ష కి ప్రతి-ఫలం (పూల చెట్టు కదూ ! ) గా మొక్క దొరకాలని కోరుకుంటున్నాను
నా బ్లాగుకి స్వాగతం పరుచూరి వంశీ కృష్ణ గారు..
తొలగించండిఅవును పూలచెట్టు..ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.:))