16 జన, 2013

విశేషాలేంటంటే...!

పండక్కి ఊరెళ్లొచ్చేశానోచ్..
మరి విశేషాలన్నీ మీకు చెప్పాలి కదా..
లేదు లేదు చెప్పను..చూపిస్తాను..
మౌస్ చక్రంపైన వేలు పెట్టి నాతో పాటూ కిందకి జారిపోండి మరి..:)

ఇంటికి వెళ్ళే దారిలో:
ఊరిలోకి ప్రవేశించాక ఇంకొక అయిదు నిమిషాలలో ఇల్లు వచ్చేస్తుందనగా..
ఆత్మీయంగా పలకరించే గోదారి గాలి ఎంత హాయో..:))ఊడుపులు తీస్తున్నారు కనిపిస్తుందా??ఆ పడవ ఎప్పుడూ అక్కడ అలానే ఉంటుంది.ఈ చోటంటే నాకు భలే ఇష్టం

మంచు కురిసేవేళలో:
ఉదయాన్నే నేను,నాన్నగారు,చెల్లి,శ్రీవారు వాకింగ్కి వెళ్ళాం..ఆ ఉషోదయపు అందాలు

 కుప్పనూర్చిన వడ్లు తినవచ్చిన చిగురాకులలో చిలకమ్మ కనిపిస్తుందా??

ఇవి గ్రామఫోన్ పువ్వులు.తూటు పువ్వులు అని కూడా అంటారు

పెరటి అందాలు:
పెరట్లో అమ్మ నాన్నా పెంచుకొనే మొక్కలు..ఎన్నెన్ని మొక్కలో..ఎన్నెన్ని పువ్వులో..వాటిలో కొన్ని

తులసీ వనం


ఈ మామిడి చెట్టు పళ్ళు ఎంత బాగుంటాయో

సంక్రాంతి ముగ్గులు:

చెల్లి చేసిన గొబ్బెమ్మలు..సున్నుండల్లాగా ఉన్నాయని తెగ ఆట పట్టించాం:)

గొబ్బెమ్మలు పెడుతున్న నేను చెల్లి.

ఇది సంక్రాంతి గొబ్బెమ్మ

నేను వేసిన సంక్రాంతి రంగవల్లి
ఇవండీ సంక్రాంతి కబుర్లు..హమ్మయ్య మీతో పంచేసుకున్నాను.ఇప్పుడు మనసుకు హాయిగా ఉందనుకోండి..:))


19 వ్యాఖ్యలు:

 1. ఛాయాచిత్రాలు చాల బాగా తీసారండి ...చాల బాగున్నాయి ..అలాగే మీ పల్లె మీద మీ ప్రేమ కూడా ముచ్చట గొలిపేల ఉంది

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నా బ్లాగుకి స్వాగతమండి నవజీవన్ గారు.మీ వ్యాఖ్య కూడా ముచ్చట గొలిపేలా ఉందండి.ధన్యవాదాలు.:)

   తొలగించు
 2. బాగున్నాయండి ఫోటోలు ముఖ్యంగా 'మంచు కురిసేవేళలో' ఇంకా ఆ పడవ :)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హయ్..సేం పించ్..నాకు కూడా ఆ పడవ ఫోటోనే భలే ఇష్టమండీ.
   నా బ్లాగుకి వచ్చి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు చైతన్య గారు..:)

   తొలగించు
 3. ushodaya vella photo chala bagundi, alage mee palle panduga vataavarananni maaku kuudaa panchi nandu thanks. simply supper all pic..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గో.జి ల వాళ్ళకి కలాపోసనెక్కువండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పిక్స్ చాలా బాగున్నాయి ధాత్రి గారూ!...మీ పండుగ విశేషాలు కూడా...చిత్రాల్లో చెప్పేశారు కడు చిత్రంగా...:-)...శర్మగారి మాటలే నావి కూడా...మన గోదావరి జిల్లా వాళ్లకి కళాపోషణ బాగా ఎక్కువే...@శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండీ మరీ
   "మడిసన్నాకా కాస్త కలాపోసన ఉండాలి" అని డవిలాగులు రాసిన పెద్దాయన గోజీనే కదా
   ధన్యవాదాలు శ్రీ గారు..:))

   తొలగించు

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))