??????

1 మార్చి, 2013

నా కళ్యాణహేల..

కాలం నిజంగా మాయాజాలమే సుమా!
అప్పుడే,అప్పుడేనా..
ఆరు ఋతువులూ నవ్వేసాయా?? 
పన్నెండు మాసాలు దొర్లిపోయాయా?
మూడువందల అరవైయయుదురోజులూ అక్షరాలా అయిపోయాయా ?
అవ్వేళ,
అయిదు వసంతాల మన కల నిజమైన వేళ
పెళ్ళిపందిరిలో నాకు నువ్వు,నీకు నేను
కళ్యాణ తిలకాలతో ఒకరికొకరు కొత్తే కదా? 
మన మధ్య తెరచల్లా తొలగగానే... 
బిడియపు బరువున సోలిన మన కళ్ళు,
కనురెప్పల్ని పైకెత్తే మన ఆతురతలు,
నును సిగ్గుల మొగ్గలైన మన బుగ్గలు,
సొట్టల్లో దాక్కున్న్న బుగ్గన చుక్కలు, 
నీది నాకు నాది నీకు మత్రమే వినబడే మన గుండె సవ్వళ్ళు  
నిజమో కలగంటున్నమో అర్ధం కాకుండానే జరిపోతున్న తంతులు 
అంతా అయిపోయాక  అప్పగింతల వేళ 
పుట్టింటి కన్నీళ్ళకు కలగలిపిన నీ కల్లళ్ళో కన్నీటి చారిక మెరుపు,
అవును అది నాకు మెరుపే పుట్టింటి ఆప్యాయతకు తీసిపోనని కదూ అర్ధం. 
ఎవరూ చుడకుండా నువ్వు తుడిచెసుకున్నా,నన్ను తప్పించుకోగలవా??
అప్పుడు ధైర్యం చెప్పిన నీ చేతి ఆత్మీయ స్పర్శ 
ఇవన్నీ కళ్ళముందు ఇంకా మెరుస్తుండగానే..
మన కళ్యాణ రాగాలు చెవుల్లో మారుమ్రోగుతుండగానే ..
'గురువారం మార్చి ఒకటి కాస్త శుక్రవారం మార్చి ఒకటి అయిపోయిందా?
                              'వలపు గెలుపు ' కడు చిత్రంగా కాలాన్ని కరిగించేసింది కదూ !

ఈ సంధర్భంగా కల్యాణఘడియలు మీతో పంచుకోవాలనిపించిందిలా..:)










14 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నా బ్లాగుకి స్వాగతం స్వాతి గారు..మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు..:)

      తొలగించండి
  2. దీర్ఘసుమంగళీ భవ

    రిప్లయితొలగించండి
  3. శ్రీవారి ప్రేమను గెలుచుకుని హ్రుదయరాణిగా కొలువై ఉన్న ధాత్రి గారు మీకు, మీ శ్రివారికి పెళ్ళిరోజు శుబాకాంక్షలు.నిత్యం మీ గుండెల్లో కల్యాణరాగాలు మ్రోగుతూనే ఉండాలని.............. మీ.........:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అందమైన శుభాకాంక్షలకు ధన్యవాదాలు పార్వతి గారు..:)

      తొలగించండి
  4. I wish you happy maaried life dhaatri gaaru:) Have a wonderful day :):)

    రిప్లయితొలగించండి
  5. అభినందనలు,శుభాకాంక్షలు,ఆశీస్సులు

    రిప్లయితొలగించండి
  6. A marriage of love is pleasant, of interest, easy, and where both meet, happy. A happy marriage has in it all the pleasures of friendship, all the enjoyments of sense and reason.Congratulations and I wish you a very happy married life.

    రిప్లయితొలగించండి
  7. చాలా చాలా ఆలస్యంగా పెళ్ళి రోజు శుభాకాంక్షలు ధాత్రి గారూ . నా బ్లాగు లో మీ వ్యాఖ్య చూసి .నేను .మీబ్లాగులోకి వచ్చేసాను . అన్నితలుపులూ తీసి .చూడ్డానికి కొంచెం సమయం పడుతుందండీ .నాక్కొంచెం కొత్త ఈ లోకం . మిమ్మల్ని మొదటి సారి చూసాను ఇప్పుడే .

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))