అందరికీ నమస్కారం...
నాకు తెలుగు అన్నా..తెలుగుతనమన్నా చాలా ఇష్టం..
తెలుగులో ఎన్నో చదివెయ్యాలనీ ...రసెయ్యాలనీ తెగ ఆరాటం..
కానీ అందరిలాగే సాంకేతిక విద్య పూర్తి చేసి ఒక బహుళజాతి సంస్థ లో (అదేనండీ ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్వేర్) ఉద్యోగం చేస్తూ ఉద్ధరిస్తున్నాను (నన్ను నేనే)
అంతా బాగానే ఉంది కాని..
ఎప్పుడూ జీవితం లో ఎదో కోల్పోతున్నామనే భావన ...అసలే నేను గోదావరి పల్లెటూరి తెలుగు అమ్మాయిని ఎమో ..అందుకే ఈ నగర వాతావరణం అంతులేని సౌకర్యాలతో బాగానే ఉన్నా..
మన వాళ్ళకు ..మన పరిసరాలకు దూరం అయిపోతున్నామనే బాధ..
వర్షం వస్తే ..ఎక్కడ దారిలో ఇరుక్కుపోతమో అని పరుగులు పెడుతూ ..నీళ్ళు మనపై చల్లి వెళ్ళిపొయే వాహనాలని , 'వేళ పాళ లేదు వర్షానికి , ఆఫిస్లో ఉన్నప్పుడు కురవొచ్చు కదా ..ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకు 'అని తిట్టుకుంటూ ఇంటికి చెరడమే కానీ ..
కేవలం మన మీద పడటానికే అన్నట్లుగా నింగి నించి ఎంతోదూరం పయనించి మన మేని పైన వాలె ఒక్క చిరు చినుకుని కూడా ఆస్వాదించలేక .. వర్షం వెలిసిపోయాక చిన్నప్పుడు బడి నించి నేను,చెల్లి వర్షం లొ తడుచుకుంటూ పాటలు పడుకుంటూ ఇంటికి చెరుకొనే (అమ్మ చేత తిట్లు తిన్నా సరే )రొజులు గుర్తొచ్చి ఒక భారమైన నిట్టూర్పు విడిచి మళ్ళీ పనుల్లో పడిపోతాను..
ఒక్క చిరుజల్లే కదు..హరివిల్లులు ..రంగవల్లులు. ఉషోదయాలు.. మంచు పూలు ..సంధ్యాకిరణాలు .. .ముసలమ్మలు.. ముసలయ్యలు ..మొక్కజొన్న కండెలు ..తెలుగు భాష ..ఇలా దేన్ని చూసినా ఇదే బాధ ..
ఈ యాంత్రిక జీవితంలో ప్రకృతి ఇచ్చే అందమైన కానుకల్ని స్వీకరించలేకపొతున్నాం.
అందుకే వీలు చిక్కినప్పుడల్ల...గూగూల్ శోధన యంత్రన్ని తెలుగులో పెట్టుకొని ..ఒక పదం శోధన చేసి దాని మీద వొచ్చే బ్లాగ్స్ అన్ని చదివేస్తాను. .
అల చదువుతూ నాక్కూడా ఇలా ఒకటి సృష్టించి ...నా అలోచనలు పంచుకోవలనిపించింది..
మొదటిసారి కదా తప్పులు ఉంటే క్షమించెయ్యండే...
Bagundi ammayi... way to go!!
రిప్లయితొలగించండిChakkagaa raasaaru :)
రిప్లయితొలగించండి@Priya:ధన్యవాదాలు ప్రియా గారు..:)
రిప్లయితొలగించండి