చాలా రోజుల తర్వాత, ఈ శనివారం ఆనంద్ సినిమా చూసాను..
నిజంగా మనసు ఆనందమయిపోయింది ...
చాలా సున్నితమయిన భావాల్ని చాలా అందంగా చూపించారు శేఖర్ కమ్ముల గారు ..
పొద్దున్నే వినిపించే శాస్త్రీయ సంగీతం నేపధ్యంలో ఒక మంచి కాఫీ.
సూటిగా ఉండే మనుషుల మధ్య ఉండే సున్నితమయిన స్నేహం..
ప్రకృతి అందాలు...సంక్రాంతి పండుగలు...గల్లిల్లో గొడవలు...వాన పాటలు...
ముఖ్యంగా హాయి గొలిపే సంగీతం...దానికి తగ్గ వేటూరి గారి సాహిత్యం...
అందులో ఒక సందర్భంలో ఈ పాట ..కధానాయిక గురించి కధానాయకుడు మనసులో పాడుకొనే పాట..
అందులో ఒక సందర్భంలో ఈ పాట ..కధానాయిక గురించి కధానాయకుడు మనసులో పాడుకొనే పాట..
"గుండెకే గాయం చేసి నిండుగా నవ్వేస్తుంది..
పాపలా ముద్దొస్తుంది..పడుచులా కవ్విస్తుంది.."
భాధని..ప్రేమనీ..కలగలుపుకున్న పాట
మనసుకి హత్తుకుంటుంది..కళ్ళళ్ళో నీళ్ళు తెప్పిస్తుంది..
ఇంకో సందర్భంలో వేటూరి గారి ఛమత్కారం..
"గస గసాల కౌగిలింత మెరిసి మాయమవుతావు ..." అని
అప్పుడు అస్సలు అర్ధం కాలేదు ..తర్వాత వేటూరి గారు ఎక్కడో చెప్తుంటే విన్నా..
అదీ..
"సగ సగాల కౌగిలింత" అంట..అంటే విరహాన్నీ.. ఇంగ్లీష్లో అంటారు చుడండీ..
''Budding Chemistry(మొగ్గ తొడుగుతున్న ప్రణయం )' అని, దానిని అల చెప్పారన్నమాట..
అన్నీ..అన్నీ..
భలే ఉన్నాయి ..ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా..
ఒక ఆడపిల్ల అత్మాభిమానాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసారు..
నాకు కవిత్వం రాదు కానీ .. ఎక్కడో ..ఆనంద్ సినిమా గురించి చదివాను..
"గోరింటాకు సరిగ్గా పండకపోతే వచ్చే బాధ..
నిద్రపోతున్నపసిపాప దగ్గర ఉండే నిశ్శబ్ధం ...
రాత్రంతా మేలుకున్నా మొగ్గ ఎప్పుడు పువ్వు అవుతుందో తెలియని మిస్టరీ..
ఆనంద్ సినిమా.."
ఎంత అందమైయ వర్ణన కదా...
ఇంతకంటే ఈ సినిమా గురించి బాగా చెప్పలేం అని నా
ఫీలింగ్ ....
ఈ సినిమా..ఎప్పుడు చూసినా
"మనసంతా ఆనందమవుతుంది..
మనసున మల్లెల మాలలూగుతాయి.. "
శేఖర్ కమ్ముల గారికి పేద్ద ధాంక్స్ ..
:):)