??????

4 ఫిబ్ర, 2013

నా గృహ హరిత సీమ


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హార్టి ఎక్స్పో అయిపోయిది.
ఎప్పుడో అయిపోయింది ఈ పిల్ల ఇప్పుడే నిద్రలెచినట్టుంది అని తిట్టుకోకండి మరీ
బుసీ అన్ననుగా..;)
ఎమిటో ఎక్స్పో ఎప్పుడు జరుగుంతుందా అని అంతర్జాలంలో ఎంత వెదికినా సమాచారం దొరకలేదు.ఇక ఈ ప్రదర్శన ఫోటోలు ప్రతి ఏడూ పెట్టి ఆనందింపజేసే తృష్ణ గారి ద్వారా ఆ వివరాలు కనుక్కున్నాను.
జనవరి 26 నించి మొదలయ్యింది.మేము 27 న వెళ్ళాము. ఆదివారం కావడంతో బాగా రద్దిగా ఉంది.అయినా అన్ని మొక్కలు చూశాను కానీ ఊహించినంత ఆకట్టుకోలేదు నన్ను.మాములుగా నర్సరీలలో దొరికే మొక్కలే కానీ ధరలు మాత్రం చుక్కలనంటుతున్నాయి.ప్రత్యేకమైన మొక్కలు అంటే బొన్సాయ్  మొక్కలు,ఆర్కిడ్లు చెప్పుకోవచ్చు.
అందుకే ఈ ప్రదర్శనలలో తప్ప మమూలుగా నర్సరీలలో దొరకని ,నాకెంతో ఇష్టమైన ఆర్కిడ్ మొక్క తీసుకున్నాను.
వంగపండు తెలుపు రంగుల మేళవింపులో భలే ఉంది కదా.దీనిని పెంచడం కూడా చాలా సులభం.ముఖ్యంగా ఇది ఇండోర్ మొక్క కాస్తంత నీరెండ ఒక అరగంట అయినా చాలు హాయిగా బ్రతికేస్తూ పువ్వులు పూస్తుంది.



ఒక చోట మాత్రం మరువం మొక్కలు చాలా ఎక్కువగా ,ఆరోగ్యంగా ఉన్నాయి.ఇక కొనకుండా ఉండగలమా??

అలా రెండు మొక్కలు మాత్రమే కొని వచ్చేసాం.కానీ మొక్కలు కొంటూ ఆనందపడుతున్న అంతమందిని చూస్తే మాత్రం భలే అనిపించింది.
నాకైతే ఇంకా చాలా మొక్కలు కొనలనే కానీ "అమ్మా మీ హరితవిప్లవాన్ని వనసీమలకు పోయి కొనసాగించండి.. అర్భక జీవిని నేనెంతా?నా ఇల్లెంతా? మీ మొక్కలకు నీళ్ళు నేను ఇచ్చుకోలేను తల్లీ "
అని ఇప్పటికే వగచి విలపించే  మా ఇంటి ఓనరుగారుగారి దీన వదనం ఒకసారి గుర్తొచ్చేసరికి ఆగిపోయాను.:P
అయినా ఎదో నా పరిధిలో విప్లవానీ కొనసాగిస్తున్నానే  అనుకోండి.;)
ఎలగో ఇంత దూరం వచ్చారు కదా .మా ఇంటి మొక్కలను పలరించేసి వెల్లండి మరీ







పైన్నించి అల్లిబిల్లిగా అల్లుకుపోతున్న ఈ లతను చూశారా?ఇది చిలకడ దుంప మొక్క తెలుసా? ఎంతో అందంగా ఉండే ఈ ఇండోర్ మొక్కను మీరు పెంచాలనుకుంటున్నారా అయితే తృష్ణ గారి బ్లాగుకి  వెళ్ళాల్సిందే ..:)




కిందనించి పైకి అల్లుకొస్తున్న ఈ మనీ ప్లాంట్ చూసారా?? దీనికి చాలా అంటే చాలా పెద్ద కధ ఉందన్నమాట.అది ఇంకో టపాలో చెప్తానేం 


ఫెంగ్షుయ్ మీద నమ్మకంతో కాదు కానీ ఈ మొక్క అంటే నాకు భలే ఇష్టం.రెండు రోజులకొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే చాలు హాయిగా పెరిగేస్తుంది ..ఏ మంచం పక్కనో పెట్టుకుంటే నిద్రలేవగానే పచ్చగా కళకళలాడుతూ మిమ్మల్ని పలుకరిస్తుంది.ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా భలేగా ఉంటుంది.


ఇవి బాల్కనీలోని మొక్కలు..మందారం,బ్రహ్మ కమలం(ఇంకా పువ్వులు పూయలేదు),నందివర్ధనం వగైరాలు.
ఆ చిన్న చిన్న మొక్కల్లేని కుండీలున్నయే వాటిల్లో మొన్న ప్రదర్శనలో రజనీగంధ మొక్క దుంపలు అమ్ముతుంటే తెచ్చి వేశాను మరి ఎప్పుడు మొలకలు వస్తాయో చూడాలి.



ఈ కలువపూల తొట్టి ఉందే దీనికోసం మా ఆయన ప్రాణాలు తొడేసాను..:)
చలికాలం కదా ఇప్పుడు పువ్వులు రావట్లేదు.ఇదిగో మొన్న నవంబరులో పూచిన పువ్వు


ఇవండీ నా హరిత నేస్తాలు.మీరు గమనించారో లేదో ఎక్కువగా ఇండోర్ మొక్కలు ఉన్నాయి.అవును మరీ అవి అయితే మా ఓనరుగారికి కనిపించవు కదా.:) 
ఇంతకీ నేను వెతుకుతున్న కాసియా జవానికా మొక్క దొరకలేదు ప్రదర్శనలో ..:((
ఇంక ప్రదర్శన కి సంభందించిన ఫోటోలు తృష్ణ గారి బ్లాగులో  చూసేసీ ఆనందించేయండి .





16 కామెంట్‌లు:

  1. wow! colourful. I am also trying for another blue tub :-)) thank you very much for the links.

    రిప్లయితొలగించండి
  2. కాంక్రీట్ జంగిల్లో కష్టమే పెంచడం. ఫోటో లు బాగున్నాయ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'కాంక్రీట్ జంగిల్ ' భలే ఉంది తాతగారు ఈ పదం..
      వ్యాఖ్యకు ధన్యవాదాలు..:)

      తొలగించండి
  3. అద్దె ఇంట్లో అద్భుతం . ఎలాగోలా మీ ఓనర్ గారికి కాస్త హరితప్రేమను అంటించండి,అప్పుడు మీ మొక్కల్నిదాచుకోనక్కర్లేదు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి..కానీ మా ఓనరుగారికి హరిత ప్రేమకన్నా గృహ ప్రేమ ఎక్కువ మరి..:)

      తొలగించండి
  4. very nice dathri.. ni illu ela anni pachhani chetlutho chustunte mucchtestundi.

    రిప్లయితొలగించండి
  5. హలో ధాత్రి గారు మీ బ్లాగ్ చాల బాగుంది .. ఈ పోస్ట్ ఇంకా బాగుంది.. గృహమే కదా స్వర్గ సీమ కం 'వనసీమ' భలే ఉందండీ మీ నందనవనం.... :) :)

    రిప్లయితొలగించండి
  6. హలో ధాత్రి గారూ మీ బ్లాగ్ చాల బాగుంది ... ఈ పోస్ట్ ఇంకా బాగుంది .గృహమే కదా స్వర్గ సీమ కం హరిత సీమ... అద్భుతః :) :)

    రిప్లయితొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))