??????

6 నవం, 2012

లక్ష్మి ..సాగరిక….









ఓసారి  ఏమైందంటే..

ఆ రోజు నాగుల చవితి అన్నమాట..పొద్దున్నే అమ్మ,నాన్న,నేను,చెల్లి స్నానాలు చెసేసి, మా వీధి  చివర ఉండే నాగుల పుట్టకి వెళ్ళిపోయి,పూజ చెసేసి,పుట్టలొ పాలు పోసేసి, ఆనక మా పొట్టలో కూడా పొసేసుకొని ఇంటికి వచ్చి టీవీలో నోము సినిమా చుస్తుంటే(ప్రతీ నాగుల చవితికీ ఈటీవీలో వస్తుంది...:) )..పక్కింటి ఆంటీ గుడికి వెళ్తూ ,అమ్మని ఎదో అడగడానికి వచ్చారు.  

ఆవిడ చక్కగా ఒక బుట్టలో తేగలు,చిమ్మిలి,తాటి బుర్రలు అన్నీ సర్దుకొని ,అరుగు మీద పెట్టారు. ."పొరిగింటి పుల్లకూర రుచి"  అని అమ్మ ఎన్ని చేసిన మేము తినకుండా ఆ ఆంటి అమ్మతో మాట్లాడి బయటకు వచ్చే లోపల మేము బుట్ట మీద పడి మొత్తం ఖాళీ  చేసేసాం .:/ ..ఆవిడ బయటకి వచ్చి ఖాళీ బుట్ట చూసుకొని..అమ్మని చూసి..ఏడవలేక నవ్వుతూ వెళ్ళిపోయింది పాపం.:D..అంతే అమ్మ మమ్మల్ని ఒక చూపు చూసింది..మాకు గుండెల్లో బస్సులు, రైళ్ళు అన్నీ పరిగెత్తాయి..భయంతో నేనూ చెల్లీ ఒక మూల కి వెళ్ళి కుర్చొని సాయంత్రం దాక కదలలేదు..అమ్మ కూడా ఏం మాట్లడలేదు..  :(


ఇంక సాయంత్రం అమ్మ ఇద్దరికీ స్నానాలు చేయించి...అన్నం పెట్టింది..అప్పుడు పాపం  అమ్మకి మా మీద జాలి వేసిందెమో..కూర్చోబెట్టుకొని కధ చెప్పటం మొదలు పెట్టింది.. 


"ఒక ఊరిలో లక్ష్మి,సాగరిక అనే మంచి పిల్లలు ఉండేవాళ్ళు అంట..వాళ్ళ ఇంటి పక్కనే రమ్య ,సౌమ్య అనే పిల్లలు కూడా ఉండేవాళ్ళు అంట..ఒక సారి లక్ష్మి,సాగరిక వాళ్ళ ఇంటికి ఒక ఆంటి గుడికి వెళ్తూ ప్రసాదం బుట్ట పట్టుకొచ్చింది  అంట..అప్పుడు లక్ష్మి, సాగరిక వాళ్ళు ఆ ప్రసాదం జాగ్రత్తగా ఈగ కూడా వాలకుండా చూసి,వాళ్ళ ఇంట్లో ఉన్న పువ్వులు కూడా కోసి ,ఆ  ప్రసాదం బుట్టలో పెట్టి  ఆంటి వెళ్ళేటప్పుడు ఆవిడకి  ఇచ్చేసారంట ..ఆ ఆంటి చాల సంతోషపడి వెళ్ళిందంట. ఆ ఆంటి పక్కనే ఉన్న రమ్య సౌమ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిందంట..వాళ్ళు ప్రసాదం మొత్తం ఖాళీ చెసేసారంట.(సీన్ అర్ధమైందా??;);))అప్పుడు ఆ ఆంటి ఏమి అనలేదు కానీ, ఊర్లో అందరికీ లక్ష్మి ,సాగరిక మంచివాళ్ళు..రమ్య ,సౌమ్య మంచివాళ్ళు కాదు అని చెప్పిందంట.."నా ప్రసాదం మీరు తినేస్తారా.. x-( అని దేవుడికి కూడా రమ్య సౌమ్య మీద కొపం వచ్చిందంట..దెవుడు వాళ్ళని శపించాడంట ..అప్పుడు వాళ్ళు క్లాస్లో లాస్ట్ వచ్చారంట...లక్ష్మి సాగరిక మాత్రం క్లాస్లో ఫస్ట్ వచ్చారంట.  .."


ఇది విన్న వెంటనే మాకు అర్దమైపోయింది ఆ రమ్య, సౌమ్య మేమేనని అంతే వెంటనే  అమ్మని పట్టుకొని ఏడవడం  మొదలు పెట్టాము " అమ్మ నిజంగానే దేవుడికి కోపం వచ్చిందా??నిజంగానే మేము ఫెయిల్ అయిపోతామా??..:(" అని అప్పుడు అమ్మ చెప్పింది ఆ ఆంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్తే దేవుడికి కోపం పోతుంది అని..వెంటనే మేము పరిగెత్తుకి వెళ్ళి ఆ ఆంటికి సారీ చెప్పి వచ్చాము.. 

ఇది మొదలు మేము ఏ చెడ్డ పని చేసినా లక్ష్మి,సాగరిక ,రమ్య,సౌమ్య..తెర మీదకి వచ్చేవాళ్ళు :D ..వెంటనే తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవటం..లక్ష్మి ,సాగరికల్లాగ అవ్వాలని రాత్రి పగలు కలలు కనేవాళ్ళం..నేను చెల్లి ఒకరికి ఒకరు..ఏం తప్పు చేసినా .."లక్ష్మి..సాగరిక ఇలా చెయ్యరు..రమ్య..సౌమ్య లాగ చేస్తున్నావ్".. అనుకొనేవాళ్ళం..క్రమంగా అమ్మ కధల్లో కూడా రమ్య సౌమ్యలు మాలాగ మoచిపనులు చేస్తు లక్ష్మి సాగరికల్లాగా  మారిపొసాగారు..మేము 7th  క్లాస్ కి వచ్చేసరికి లక్ష్మి,సాగరిక ,రమ్య,సౌమ్య అందరూ మంచి పిల్లలైపోయరు.. :D


కానీ అమ్మ చెప్పిన ఆ కధలన్నీ కాశీ మజిలి కధల్లాగా ఒక బుక్  వెయ్యొచ్చు..ఇప్పటికి ఏమన్నా చెడ్డ పని  చేస్తే ఎదో ఒక కధ గుర్తొస్తుంది..అమ్మ ఆ పాత్రలకి పెట్తిన పేర్లు..వాటి ప్రవర్తన అంతా ఎంత బాగుండేదో..సాగరిక (సాగరం నించి పుట్టినది అంటే లక్ష్మి దేవి అన్నమాట)  పేరు అంటే నాకు మరీ ఇష్టం..:)

ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశం మీద మనకు ఇంటర్నెట్,  టీవీ ,పేపర్లలో బోలెడంత సమాచారం గైడెన్స్   దొరుకుతుంది..కానీ ఇవేమీ లేని ఆ రోజుల్లోనే అమ్మ ఎంచుకున్న విధానం ఇప్పటికీ మమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది..ఎవరితోనూ మమ్మల్ని పోల్చలేదు..ఎక్కువగా ఎప్పుడూ తిట్టలేదు..తన క్రియేటివిటితో,సహనంతో  రమ్య ,సౌమ్య ల్లాంటి తన పిల్లల్ని లక్ష్మి సాగరిక ల్లాగ మార్చుకుంది....:)

తల్లితంద్రులు పిల్లలికి ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు   ..జీవితవు విలువలు నేర్పాలి..అసలు విలువలే తెలీకుండా  కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతోమంది బ్రతుకుతున్నారు..కానీ నిజమైన తృప్తి ఎంతమందికి ఉంటుంది..  


నేను ఎంతవరకూ నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ  అలాంటి విలువలు నేర్పిన అమ్మ నాన్నలకి  కృతజ్ఞతలతో....



11 కామెంట్‌లు:

  1. మీ అమ్మగారికి నమస్కారములు. మీ తుది పలుకులు బావున్నాయి ధాత్రి గారు.

    రిప్లయితొలగించండి
  2. @జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు..:)

    రిప్లయితొలగించండి
  3. @అజ్ఞాత:Thank You...:)
    @చివరి అజ్ఞాత;)..Thank You Phani...:)

    రిప్లయితొలగించండి
  4. Yentho adrushtavanthulu meeru.. :)
    Ika ee post.. chaala chaalaa baagaa raasaaru :)

    రిప్లయితొలగించండి
  5. @Priya:అవును ప్రియా గారు..పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు..:)

    రిప్లయితొలగించండి
  6. "తల్లితండ్రులు పిల్లలికి ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు ..జీవితవు విలువలు నేర్పాలి." -అవును. సందేహం లేదు. మంచి మాట.

    నాగుల చవితి కి పుట్టలో పాలు పోసే అలవాటు ఇంకా ఉందా?
    పాములు సరీస్పృపాలు. అవి పాలివ్వవు, పాలు తాగవు. భక్తులు పుట్టలో పొసే పాలకు చీమలువస్తాయి. అవి పామును కుట్టి బాధిస్తాయి. ఈ బాధ ఎక్కువయితే పాము చనిపోతుంది కూడా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. cbrao గారు నా బ్లాగుకి స్వాగతం.
      మీకాభయం అక్కర్లేదు గారు.మేము పాలు పోసే పుట్ట నిజంది కాదు.గుడిలో అందరి పూజ కోసం సిమెంట్ తో చేసిన పుట్ట.
      స్పందనకు చాలా ధన్యవాదాలు..:)

      తొలగించండి

స్పందించి మీరు చెప్పే ఒక్క ముక్క..నా ఇంకో టపాకు ప్రేరణ..
పొగిడినా సరే..సద్విమర్శించినా సరే..:))